డైలమాలో నాగబాబు, ఆ నిర్ణయం వెనక పవన్?
గతంలో ఓ టీవీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ....'ఆరెంజ్ సినిమా వల్ల చాలా నష్టపోయాను. నా జీవితంలో సంపాదించుకున్నదంతా పోగా అప్పులపాలయ్యాను. ఒకానొక దశలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాను. విషయం తెలుసుకున్న కళ్యాణ్...అప్పుల సంగతి తాను చూసుకుంటానన్నారు' అని చెప్పుకొచ్చారు.
తాజాగా నాగబాబు తన జీవితంలో మరో కీలకమైన, క్రిటికల్ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఒకరకంగా ఏ నిర్ణయం సరైందో తెలియక డైలమాలో ఉన్నారు. ఆవిషయం మరేదో కాదు.... తన తనయుడు వరుణ్ తేజ్ సినీరంగ ప్రవేశం గురించి. వరుణ్ తేజ్ సక్సెస్ ఫుల్‌గా లాంచ్ చేయగలితే తన బాధ్యత, బరువు తీరినట్లే అనే ఆలోచనలో ఉన్నారు నాగబాబు.
ప్రస్తుతం వరుణ్ తేజను ఏ దర్శకుడి ద్వారా లాంచ్ చేస్తే సక్సెస్ అవుతాడనే విషయమై నాగబాబు సరైన నిర్ణయానికి రాలేక పోతున్నాడు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నారు కాబట్టి...తొలి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటేనే వరుణ్ తేజకి మంచి భవిష్యత్ ఉంటుందనేది నాగబాబు ఆలోచన.
ఇందుకోసం తొలుత శ్రీకాంత్ అడ్డాలను దర్శకుడిగా ఎంచుకున్నారు. ఏమైందో తెలియదు కానీ లైన్లోకి పూరినీ తీసుకొచ్చాడు. ఇప్పుడు పూరినీ కూడా మర్చేసి దర్శకుడు క్రిష్ ద్వారా వరుణ్ తేజ్‌ను లాంచ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కాగా..పూరి జగన్నాథ్ ని మార్చడం వెనక పవన్ కళ్యాణే కారణం అంటున్నారు. పవన్ మీద పూరీ చేసిన వ్యాఖ్యల ఫలితం, మెగా అభిమానులు పూరి వ్యతిరేకంగా మారడం లాంటి కారణాలు ఇందులో ఉన్నాయట.


Click it and Unblock the Notifications












