twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మమ్మల్ని కెలుకొద్దు.. అందరి జాతకాలు బయటపెడుతాం.. నాగబాబు

    By Rajababu
    |

    మా వ్యక్తిగత జీవితంలోకి వెళ్లొద్దు. ఓ వ్యక్తిని ఎదుర్కోవడం చాతకపోతే.. ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని చంపాలనుకొనే సన్నాసులు, వెధవలు ఉన్నారు. అలా అని పర్సనల్ లైఫ్‌ను టార్గెట్ చేయవద్దు. బయట ఎవడో ట్రోల్ చేస్తే వాడిపై ఫిర్యాదు చేయండి. అంతేకాని మమ్మల్ని వ్యక్తిగతంగా కెలుకవద్దు. ఎదైనా తప్పు చేస్తే నేను ఈ తప్పు చేశానని ఒప్పుకొనే దమ్మున్న వ్యక్తి నా తమ్ముడు పవన్ కల్యాణ్. మీకు ఉందా దమ్ము అని నాగబాబు ప్రశ్నించారు. సినీ పరిశ్రమపై వస్తున్న ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు.

    బుధవారం ఫిలిం ఛాంబర్‌లో నాగబాబు మాట్లాడుతూ.. ఓ మంచి పనికోసం పవన్ కల్యాణ్ ప్రజల్లోకి వెళ్లారు. ఎలాంటి విషయాలు పట్టించుకోవడం లేదు. నా తమ్ముడితో మాట్లాడక ఆరు నెలలు అవుతున్నది. వాడిని నేను డిస్ట్రబ్ చేయను. సినీ పరిశ్రమలో పవన్ నంబర్‌వన్. కోట్ల రూపాయలు వస్తున్నా అవేమీ పట్టించుకోకుండా ప్రజల్లోకి వెళ్లారు. నీ వద్ద డబ్బులు కూడా లేవు అని మేము ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు. అలాంటి పవన్ కల్యాణ్‌ను తిడుతారా? విమర్శిస్తురా అని నాగబాబు ప్రశ్నించారు.

    Nagababu: Dont criticise Pawan Kalyan without any proofs

    ఇండస్ట్రీలో ఉన్న సమస్యల కోసం పోరాటం చేస్తాం. ఈ విషయాన్ని ఇంతటితో మీడియా ఆపేద్దాం. ఈ విషయాన్ని చెప్పడానికి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్ లాంటి రానక్కర్లేదు. వారు స్పందించే, సందర్భాలు విషయాలు వేరే ఉన్నాయి. ఇండస్ట్రీ, దేశానికి సంబంధించిన సమస్యల గురించి వారు స్పందిస్తారు. దయచేసి ఇంతటితో ఆపేయండి. ఇక ముందు కూడా ఇదే కొనసాగితే మేము అందరి జాతకాలు బయటపెడుతాం. మా చేతుల్లో చాలా ఉన్నాయి. ఇండస్ట్రీపై ఆరోపణలు చేయవద్దు అని నాగబాబు హెచ్చరించారు.

    English summary
    Actor Nagababu reacted on recent development on film Industry in media. He speaks about allegations made on the Industry. He promised that he will take care of issues related to Industry. He requested that.. Do not go into Pawan Kalyan personal life.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X