Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మమ్మల్ని కెలుకొద్దు.. అందరి జాతకాలు బయటపెడుతాం.. నాగబాబు
మా వ్యక్తిగత జీవితంలోకి వెళ్లొద్దు. ఓ వ్యక్తిని ఎదుర్కోవడం చాతకపోతే.. ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని చంపాలనుకొనే సన్నాసులు, వెధవలు ఉన్నారు. అలా అని పర్సనల్ లైఫ్‌ను టార్గెట్ చేయవద్దు. బయట ఎవడో ట్రోల్ చేస్తే వాడిపై ఫిర్యాదు చేయండి. అంతేకాని మమ్మల్ని వ్యక్తిగతంగా కెలుకవద్దు. ఎదైనా తప్పు చేస్తే నేను ఈ తప్పు చేశానని ఒప్పుకొనే దమ్మున్న వ్యక్తి నా తమ్ముడు పవన్ కల్యాణ్. మీకు ఉందా దమ్ము అని నాగబాబు ప్రశ్నించారు. సినీ పరిశ్రమపై వస్తున్న ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు.
బుధవారం ఫిలిం ఛాంబర్లో నాగబాబు మాట్లాడుతూ.. ఓ మంచి పనికోసం పవన్ కల్యాణ్ ప్రజల్లోకి వెళ్లారు. ఎలాంటి విషయాలు పట్టించుకోవడం లేదు. నా తమ్ముడితో మాట్లాడక ఆరు నెలలు అవుతున్నది. వాడిని నేను డిస్ట్రబ్ చేయను. సినీ పరిశ్రమలో పవన్ నంబర్‌వన్. కోట్ల రూపాయలు వస్తున్నా అవేమీ పట్టించుకోకుండా ప్రజల్లోకి వెళ్లారు. నీ వద్ద డబ్బులు కూడా లేవు అని మేము ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు. అలాంటి పవన్ కల్యాణ్‌ను తిడుతారా? విమర్శిస్తురా అని నాగబాబు ప్రశ్నించారు.
ఇండస్ట్రీలో ఉన్న సమస్యల కోసం పోరాటం చేస్తాం. ఈ విషయాన్ని ఇంతటితో మీడియా ఆపేద్దాం. ఈ విషయాన్ని చెప్పడానికి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్ లాంటి రానక్కర్లేదు. వారు స్పందించే, సందర్భాలు విషయాలు వేరే ఉన్నాయి. ఇండస్ట్రీ, దేశానికి సంబంధించిన సమస్యల గురించి వారు స్పందిస్తారు. దయచేసి ఇంతటితో ఆపేయండి. ఇక ముందు కూడా ఇదే కొనసాగితే మేము అందరి జాతకాలు బయటపెడుతాం. మా చేతుల్లో చాలా ఉన్నాయి. ఇండస్ట్రీపై ఆరోపణలు చేయవద్దు అని నాగబాబు హెచ్చరించారు.