మా అధ్యక్షుడు నాగబాబు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షునిగా ప్రముఖ నిర్మాత, నటుడు, మెగాస్టార్ చిరంజీవి సోదరుడు కె. నాగేంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2006 నుంచి 2008 వరకూ రెండేళ్ల పాటు ఆయన మా అధ్యక్షునిగా వ్యవహరిస్తారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టాలిన్ చిత్రాన్ని నిర్మించిన నాగబాబు నటుడిగా కూడా చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా ఏ పాత్రయినా పోషిస్తునే ఉన్నారు. సహజంగా మృదుస్వభావి, హాస్యప్రియుడు అయిన నాగబాబు అనేకమంది నటీనటులకు ఆప్తులుగా కూడా ఉన్నారు. గతంలో మెగాస్టార్‌తో రుద్రవీణ, త్రినేత్రుడు, బావగారూ బాగున్నారా.. తాజాగా స్టాలిన్ చిత్రాలను రూపొందించి నిర్మాతగా తమ అభిరుచిని కూడా చాటుకున్నారు. నాగబాబు హయాంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌తో పాటు సినీపరిశ్రమ కూడా అభివృద్ధి చెందాలని పలువురు సినీప్రముఖులు తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications