twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓ శకం ముగిసినట్టుంది.. ఆ రోజులు ఇంకా గుర్తున్నాయి.. నిహారిక పెళ్లిపై నాగబాబు ఎమోషనల్

    |

    ఏ తండ్రికైనా జీవితంలో ఓ పరిస్థితి ఏర్పడుతుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురుని వేరే ఒకరి చేతిలో పెట్టాల్సి వస్తుంది. దాదాపు 25 ఏళ్లు గుండెలకు హత్తుకుని పెంచిన కూతురు ఇక నుంచి ఇంట్లో ఉండదు.. గలగల మాట్లాడే ఆ గొంతు వినిపించదంటే ఆ తండ్రి పదే బాధ అందరికీ తెలిసిందే. ప్రస్తుతం నాగబాబు అదే స్థితిలో ఉన్నాడు. పెళ్లి సంబరాలను ఎంత ఘనంగా నిర్వహించి సంబరపడ్డా కూడా అప్పగింతల సమయానికి కన్నీరుపెట్టాల్సిందే.

    నిహారికపై అంతులేని ప్రేమ..

    నిహారికపై అంతులేని ప్రేమ..

    నాగబాబుకు తన కూతురు నిహారికపై అంతులేని ప్రేమ ఉంది. చిన్నతనం నుంచి నిహారికను ఎంత జాగ్రత్తగా అల్లారు ముద్దుగా పెంచాడో తన వీడియోల ద్వారా చెబుతుంటాడు. అయితే ఎంత జాగ్రత్తగా పెంచినా కావాల్సిన స్వేచ్చను, అభిప్రాయాలను పంచుకునే స్నేహితుడిలానే ఉంటూ వచ్చానని కూతురిపై ప్రేమను కనబర్చుతుంటాడు.

     నిహారిక పెళ్లి..

    నిహారిక పెళ్లి..

    నిహారిక పెళ్లి విషయంలోనూ నాగబాబు ఆ మధ్య ఎమోషనల్ అయ్యాడు. నా నీహా తల్లికి అప్పుడే పెళ్లా.. అప్పుడే పెళ్లి వయసు వచ్చిందా? అంటూ నాగబాబు ఆ మధ్య బుల్లితెరపై వచ్చిన ఓ ఈవెంట్‌లో ఎమోషనల్ అయ్యాడు. అలాంటి నాగబాబు నిహారికకు మూడు ముళ్లు పడటంతో భావోద్వేగానికి లోనయ్యాడు.

     మూడు ముళ్లుపడటంతో..

    మూడు ముళ్లుపడటంతో..

    తాజాగా నిహారిక మెడలో చైతన్య మూడు ముళ్లు వేసేశాడు. ఈ సందర్భంగా నాగబాబు భావోద్వేగానికి లోనయ్యాడు. కూతురిపై ఉన్న ప్రేమను, తండ్రి పడే బాధను ఎంతో అందంగా వివరించాడు. ప్రతీ తండ్రికి ఇలాంటి ఎమోషనే ఉంటుందని అందరికీ తెలిసినా నాగబాబు చెప్పిన మాటలు మాత్రం ఆకట్టుకుంటున్నాయి.

    Recommended Video

    Nagarjuna Akkineni To Fans On Apple Products
    శకం ముగిసినట్టుంది..

    శకం ముగిసినట్టుంది..

    ఓ శకం ముగిసినట్టుంది.. పాత జ్జాపకాలన్నీ నన్ను వెంటాడుతున్నాయి.. నిహారిక ఫస్ట్ స్కూల్‌కు వెళ్లిన రోజు గుర్తుకు వస్తోంది.. మళ్లీ సాయంత్రానికి తిరిగి రాదేమో అన్న ఫీలింగ్ కలుగుతోంది.. అయితే అలా స్కూల్‌కు వెళ్లే వయసు వచ్చిందన్న నిజాన్ని నమ్మేందుకే నాకు చాలా ఏళ్లు పట్టింది.. మళ్లీ నేను తనతో 24 గంటలు ఆడుకోలేనేమో.. అయితే ఈ సారి మాత్రం ఆ ఫీలింగ్ ఎప్పటి వరకు ఉంటుందో తెలియడం లేదు.. అదే కాలమే నిర్ణయించాలి.. ఇప్పటికే నా నీహా తల్లిని మిస్ అవుతున్నాను.. అంటూ నాగబాబు ఎమోషనల్ అయ్యాడు.

    English summary
    It looks like the end of an Era.... Serious nostalgia hit me all again... It feels like the first day of her school...just that she wont be returning by evening. It took years to make peace with the fact that my baby girl is all grown up to go to school and I can't play with her 24 x 7.... Just donno how long it will be this time....'Only time will decide.' Already missing you Niha thalli..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X