కష్టసుఖాల్లో తోడు నిలిచారు.. నేను గర్వించే రోజు ఇది.. సోదరులపై నాగబాబు ఎమోషనల్ ట్వీట్

మెగాబ్రదర్ నాగబాబుకు అన్నయ్య చిరంజీవి అన్నా తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్నా వల్లమాలిన ప్రేమ అన్నసంగతి తెలిసిందే. కష్టసుఖాలు, జీవితంలోని ఒడిదుడుకుల్లో అన్నింటా తోడుగా నిల్చున్నారు. చివరకు ఒకానొక సమయంలో ఆత్మహత్యే శరణ్యమని అనుకున్న నాగబాబుకు అన్ని విధాలుగా సాయం చేసి మళ్లీ కొత్త జీవితాన్ని ఇచ్చారు. ఈ విషయాన్ని నాగబాబే స్వయంగా ఎన్నోసార్లు చెప్పాడు.

వారిద్దరూ లేకుండా తాను ఉండేవాడిని కానని, వారి వల్లే ఇప్పుడు ఇలా ఉన్నానని చెబుతూనే ఉంటాడు. తన జీవితం సోదరులకే అంకితమని పలుమార్లు చెప్పుకొచ్చని నాగబాబు.. నేటి సోదరుల దినోత్సవం సందర్భంగా కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

సోదరుల కోసమే..

సోదరుల కోసమే..

మెగా బ్రదర్ నాగబాబు ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పుకొచ్చాడు. కెరీర్ స్టార్టింగ్‌లో తన కోసమంటూ ఏదీ చూసుకోలేదని, చిరంజీవి వెంటే ఉంటే ఆయన వ్యవహారాలు చూసుకునేవాడినని ఇది వరకే పేర్కొన్నాడు. వేరే లోకమంటూ ఏది లేకుండా ఉండేవాడినని, ఎప్పుడూ కూడా తనకంటూ ఓ జీవితం ఉందని గుర్తుకు వచ్చేది కాదని తెలిపాడు.

అన్నీ నష్టాలే..

అన్నీ నష్టాలే..

అన్నదమ్ములిద్దరూ సినిమాల్లో హీరోగా ఉండగా.. నాగబాబు నిర్మాణ రంగంలోకి వచ్చాడు. అంజనా ప్రొడక్షన్స్ పెట్టి కొన్నిచిత్రాలను నిర్మించారు. అది కూడా చిరంజీవి సలహా మేరకు అటువైపుగా వచ్చానని చెబుతూ ఉండేవాడు. అయితే ఆ బ్యానర్‌లో నిర్మించిన చిత్రాలు కమర్షియల్‌గా వర్కౌట్ అయ్యేవి కాదు.

ఆ సినిమాతో పూర్తిగా..

ఆ సినిమాతో పూర్తిగా..

రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఆరెంజ్ సినిమాతో నాగబాబు పూర్తిగా నేలకూలిపోయాడు. ఆ సమయంలో ఆత్మహత్య అనే ఆలోచన వచ్చిందని, ఆ విషయం తెలుసుకుని చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ డబ్బును సర్దేశారని అలా తన ప్రాణాలను కాపాడరని నిరంతరం చెబుతూనే ఉంటాడు. అక్కడి నుంచి కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వచ్చిన నాగబాబు ప్రస్తుతం సెటిలయ్యాడు.

Recommended Video

Nathuram Godse Has Patriotism, Media Didn't Project His View That Time: Nagababu
నాగబాబు ఎమోషనల్ ట్వీట్..

నాగబాబు ఎమోషనల్ ట్వీట్..

అందుకే నేటి బ్రదర్స్ డే సందర్భంగా నాగబాబు తన సోదరులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. ‘సోదరుల దినోత్సవమనేది నేను గర్వించే రోజు. మా సోదరులుండే విధానం నాకిష్టం. కష్టసుఖాల్లో మంచి చెడులన్నింట్లో తోడు నిలిచిన మా సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌కు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను' అని ట్వీట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X