అన్న నాగబాబుని ఆదుకోవటానికే పవన్ ఓకే !?
తన అన్నగారైన నాగబాబు..తాజాగా "ఆరెంజ్" చిత్రంతో భారీ దెబ్బ తినటంతో ఆదుకోవటానికి పవన్ కళ్యాణ్ నడుం బిగించాడని తెలుస్తోంది. అందులో భాగంగా తన డేట్స్ ని ఇస్తానని నాగబాబుని ఓదార్చాడని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రం పిబ్రవరి 2011 నుంచి ప్రారంభించుకోమని అన్నాడని చెప్పుకుంటున్నారు. ఇక దర్శకుడు, కథ ఏమిటన్నది ఫైనలైజ్ కాలేదు. దాంతో అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పవన్ సినిమా చేస్తున్నట్లు అయింది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్..జయంత్ సి.పరాంన్జీ దర్శకత్వంలో లవ్ ఆజ్ కల్ రీమేక్ లో చేస్తున్నారు. త్రిష హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి లవ్ లీ అనే టైటిల్ పెట్టారు. అలాగే సింగీతం శ్రీనివాసరావు దర్సకత్వంలో క్ర్రీస్తు జీవిత కథ ఆధారంగ రూపొందుతున్న చిత్రంలోనూ పవన్ కీలకమైన పాత్రను చేస్తున్నారు.
నాగబాబు పవన్ కళ్యాణ్ త్రిష లవ్ ఆజ్ కల్ సింగీతం శ్రీనివాసరావు nagababu pawan kalyan trisha love aaj kal singeetham srinivasa rao


Click it and Unblock the Notifications