భూములు పంచుకుంటున్నారన్న బాలయ్య.. ఇండస్ట్రీకి నువ్ కింగ్ కాదంటూ నాగబాబు ఫైర్

నందమూరి బాలకృష్ణ మీడియా ముందుకు వస్తే ఎలా ఉంటుందో మరోసారి నిరూపితమైంది. నేడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా నివాళి అర్పించిన బాలయ్య.. సినీ పెద్దలపై సంచలన కామెంట్స్ చేశారు. సినీ పరిశ్రమ పునరుద్దరణకు, షూటింగ్స్ తిరిగి ప్రారంభించే విషయమై సినీ పెద్దలందరూ తెలంగాణ ప్రభుత్వంతో గత కొన్ని రోజులుగా చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ భేటీలపై బాలయ్య బాబు స్పందిస్తూ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.

బాలయ్య వ్యాఖ్యలు వైరల్..

బాలయ్య వ్యాఖ్యలు వైరల్..

సినీ పెద్దలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చలు, అలాగే ముఖ్యమంత్రులతో సినీ ప్రముఖులు సమావేశం అవుతున్న విషయం తనకు తెలియదని బాలయ్య కామెంట్స్ చేశాడు. అంతటితో వదిలసినా ఈ వ్యవహారం ఇంతగా సంచనం సృష్టించేది కాదు.

భూములు పంచుకుంటున్నారు..

భూములు పంచుకుంటున్నారు..

ప్రభుత్వంతో సినీ పెద్దలు భేటీని ఉటంకిస్తూ.. భూములు పంచుకునేందుకు మీటింగ్‌లు పెట్టుకుంటున్నారని ఆరోపించాడు. అంతేకాకుండా అసభ్య పదజాలాన్ని కూడా వాడాడు. ప్రస్తుతం ఈ ఆడియో తెగ వైరల్ అవుతోంది. వీటిపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించాడు.

పిలవడం తప్పా ఒప్పా..

పిలవడం తప్పా ఒప్పా..

నాగబాబు తన యూట్యూబ్ చానెల్ ద్వారా మాట్లాడుతూ.. లాక్ డౌన్ కారణంగా దెబ్బతిన్న పరిశ్రమను ఆదుకునేందుకు సినీ పెద్దలందరూ మంత్రి తలసానితో కలిసి చిరంజీవి ఇంట్లో సమావేశామయ్యారని చెప్పుకొచ్చాడు. అయితే ఈ భేటీకి బాలకృష్ణను పిలవకపోవడం తప్పో ఒప్పో తనకు తెలీదన్నాడు. అయితే ఆ విషయాన్ని బాలకృష్ణ మీటింగ్ ఏర్పాటు చేసినవారిని అడగొచ్చని, ఆ హక్కు ఉందని అన్నాడు.

ఎవరేం చేశారో అందరికీ తెలుసు..

ఎవరేం చేశారో అందరికీ తెలుసు..

అయితే ఆయన భూములు పంచుకోవడానికి మీటింగ్‌లు పెట్టుకుంటున్నారని అనడం మాత్రం తప్పని ఆగ్రహం వ్యక్తం చేశాడు. రియల్ ఎస్టేట్ ఎవరు చేశారో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలా నాశనం చేశారో అక్కడి వెళితే తెలుస్తుందని సెటైర్ వేశాడు.

క్షమాపణ చెప్పాల్సిందే..

క్షమాపణ చెప్పాల్సిందే..

భూములు పంచుకోవడానికి అని చెప్పి.. తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేశాడని చెప్పుకొచ్చాడు. ముందుగా ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. ఇలా ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే కుదరదని, అలా మాట్లాడటానికి తమ వద్ద కూడా ఎంతో మంది ఉన్నారని అన్నాడు.

Recommended Video

Sri Reddy Post On Poonam Kaur Over PK Mask
మీరేం కింగ్ కాదు..

మీరేం కింగ్ కాదు..

మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడలని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీకి నువ్వేమీ కింగ్ వి కాదని, జస్ట్ ఓ హీరోవేనని బాలయ్యపై ఘాటుగా స్పందించాడు. మరి వీటిపై బాలయ్య ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X