అందుకే రోజాను కమెడియన్ అని చెప్పా.. కాంట్రవర్సీపై నాగబాబు క్లారిటీ
మెగా బ్రదర్ నాగబాబు అంటే వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌లా మారిపోయాడు. సోషల్ మీడియాలో నాగబాబు దూకుడు మామూలుగా ఉండటం లేదు. నెగెటివిటీ ఎంత వచ్చినా, ఎంత ట్రోల్ చేసినా కూడా ధీటుగా బదులిస్తాడు. ఇక నాగబాబు చేసే కామెంట్లు మీడియాలో ప్రముఖంగా కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంటాయి. ఈ మధ్యే నాగబాబు తన ఫాలోవర్లతో చేసిన చిట్ చాట్ అందరినీ ఆకట్టుకుంది.

కౌంటర్ల మీద కౌంటర్లు..
నాగబాబు ఈ మధ్య తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టాడు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు అదే రేంజ్‌లో తిప్పి కొట్టేశాడు. మీకు ఏ డిష్ (తినే పదార్థం) అంటే ఇష్టమని ఓ నెటిజన్ అడిగితే.. టాటా స్కై డిష్ టీవీ అంటే ఇష్టమని చెప్పుకొచ్చాడు. అది చూసి అందరూ షాక్ అయ్యారు.

పంచ్‌ల మీద పంచ్‌లు..
మీ లాంటి స్టార్స్ ఇలా రిప్లై ఇవ్వడం గ్రేట్ సార్ అంటే.. స్టార్సా? ఇక్కడ ఎవరున్నారు అంటూ కౌంటర్ వేశాడు. దానికి బ్రహ్మానందం ఫోటోలను వాడేశాడు. ఇక పర్సనల్ విషయాలపైనా కౌంటర్లు వేసుకున్నాడు. తన భార్య పోవే పోరా అంటుందని కూడా చెప్పేశాడు

రోజా మీద అలా..
జబర్దస్త్‌లో మీకు ఇష్టమైన కమెడియన్ ఎవరు అని అడిగితే.. రోజా అంటూ నాగబాబు పంచ్ వేశాడు. అయితే రోజాను కమెడియన్‌గా సంబోధించడంపై అందరూ షాక్ అయ్యారు. అది పెద్ద కాంట్రవర్సీగా మారింది. అయితే తాజాగా ఆ వివాదంపై నాగబాబు క్లారిటీ ఇచ్చాడు.

అంతకు మించి ఏం లేదు..
అయితే తాజాగా నాగబాబు మీమర్స్‌తో లైవ్‌లో మాట్లాడుతూ.. రోజా వివాదంపై స్పందించాడు. కమెడియన్ అంటే ఎవ్వరైనా గెటప్ శ్రీను, భాస్కర్ పేరు చెబుతాను అని అనుకుంటారు. అందుకే వెరైటీగా ఉంటుందని, మీ(మీమర్స్)లాంటి వాళ్లందరూ షాక్ అవుతారని ఆమె పేరు చెప్పాను. అంతే కాకుండా ఆమె పంచ్‌లు కూడా బాగానే వేస్తున్నారు. అందుకే అలా చెప్పాను. మా ఇద్దరి మధ్య రాజకీయంగా విబేధాలున్నా కూడా పర్సనల్‌గా ఎలాంటివి లేవని చెప్పుకొచ్చాడు నాగబాబు.


Click it and Unblock the Notifications











