»   »  ఫ్యాన్స్ ఏం చేయలేరు!...పవన్‌ను ఇమిటేట్ చేస్తున్న నాగబాబు

ఫ్యాన్స్ ఏం చేయలేరు!...పవన్‌ను ఇమిటేట్ చేస్తున్న నాగబాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇపుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కలెక్షన్ల వర్షం కురిపించే పెద్ద స్టార్. ఆయనతో సినిమాలు చేసిన నిర్మాతలకు లాభాల పంట. పవర్ స్టార్ క్రేజ్‌ను ఇతర చిన్న హీరోలు, నిర్మాతలు తమ సినిమాల్లో ఏదో ఒకరకంగా వాడుకుని థియేటర్లకు ప్రేక్షకులను రప్పించే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.

  ఒక రకంగా చెప్పాలంటే...ప్రస్తుత పరిస్థితిలో తెలుగు సినిమా ఇండస్ట్రీ పాలిట కలెక్షన్ల దేవుడిగా మారాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్‌కు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ తెలుగులో మరే హీరోకు కూడా లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పవన్ అంటే వారికి ఎంత వీరాభిమానం అంటే....ఆయన‌పై ఇతర సినిమాల్లో ఏమైనా పంచ్‌ డైలాగ్ వచ్చినా తట్టుకోలేనంతగా....

  ఆ మధ్య 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో పవర్ కళ్యాణ్‌పై సెటైర్ వేసేలా డైలాగ్ ఉండటంతో దర్శకుడు పూరి జగన్నాథ్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పవన్ కల్యాణ్‌ను ఇమిటేట్ చేస్తూ ఏమైనా సీన్లు చేద్దామన్నా చేయలేని పరిస్థితి.

  ఆరెంజ్ సినిమా భారీ నష్టాలతో నిర్మాత అవతారన్ని చాలించిన పవన్ సోదరుడు నాగబాబు ప్రస్తుతం నటుడిగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో సరికొత్త ప్లాన్లతో ముందుకు వస్తున్నారు పలువురు ఫిల్మ్ మేకర్స్. పవన్ కళ్యాణ్‌ను ఇమిటేట్ చేస్తూ చేసే సీన్లకు, పవన్ కళ్యాణ్ పేరు వాడుకుని కామెడీ పండించే సీన్లకు నాగబాబును ఎంచుకుంటున్నారు. నాగబాబుతో ఇలాంటి పాత్రలు చేయించడం వల్ల పవన్ అభిమానులు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా అదుపులో పెట్టడంతో పాటు భారీగా ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించ వచ్చనేది వారి ఆలోచనగా కనిపిస్తోంది.

  ఆ మధ్య ఓ సినిమాలో నాగబాబు 'టవర్ స్టార్..ఫ్యాన్ ఆఫ్ పవర్ స్టార్' పాత్రలో కామెడీ పండించిన సంగతి తెలిసిందే. తాజాగా 'చూసినోడికి చూసినంత' చిత్రంలో నాగబాబు గౌతం నందా పాత్రలో కనిపించబోతున్నారు. 'అత్తారింటికి దారేది' చిత్రంలో పవన్ పోషించిన గౌతం నందా పాత్రను ఇమిటేట్ చేస్తూ ఈ పాత్ర ఉండనుందట.

  English summary
  In an upcoming film titled 'Choosinodiki Choosinantha', Nagababu is playing the role of a powerful businessman returned from abroad named 'Gowtham Nanda'. Not just the name of Pawan's character in 'Attarintiki Daredi', Nagababu is simply donning all those trademark costumes of Pawan from the movie and is taking up his younger brother's mannerisms too. In one shot, Nagababu wants to produce huge fun with his AD act.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more