»   » వాడు తేడా, ఫ్యాన్స్ కోసం ఇదంతా చేయడం లేదు: పవన్ కళ్యాణ్ గురించి నాగబాబు!

వాడు తేడా, ఫ్యాన్స్ కోసం ఇదంతా చేయడం లేదు: పవన్ కళ్యాణ్ గురించి నాగబాబు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా రూ. 1000, రూ. 500 రద్దు చేయడం, మోడీ తీసుకున్న డిమోనిటైజేషన్ నిర్ణయంపై ఇటీవల నాగబాబు తనదైన రీతిలో స్పందిస్తూ ఓ యూట్యూబ్ వీడియో విడుదల చేసిన చేసిన సంగతి తెలిసిందే. మెడీ తీసుకున్న నిర్ణయానికి తన పూర్తి మద్దతు ప్రకటించారు నాగబాబు.

అన్న చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉండగా, తానూ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉంటూ....... నాగబాబు ఈ ప్రకటన చేయడంతో మీడియాలో ఒక్కసారిగా ఫోకస్ అయ్యాడు. తాజాగా ప్రముఖ పాత్రికేయుడు విక్రమ్ పూలతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబు మరోసారి ఈ అంశపై తన వైఖరిని స్పష్టం చేశారు.

దీంతో పాటు చిరంజీవి, ప్రజారాజ్యం, పవన్ కళ్యాణ్, జనసేన అంశాల గురించి కూడా నాగబాబు తనదైన రీతిలో స్పందించారు.

మోడీలా లాంటి వారు అవసరం

మోడీలా లాంటి వారు అవసరం

మోడీ తీసుకున్న డిమోనిటైజేషన్ నిర్ణయానికి తన పూర్తి మద్దతు ఇస్తున్నానని, ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడే దేశం బాగుపడుతుందని నాగబాబు చెప్పుకొచ్చారు. దీని వల్ల ప్రజలు తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు పడుతున్నా.... దీర్ఘ కాలంలో అందరికీ మంచి జరుగుతుందని నాగ బాబు అన్నారు.

పవన్ వ్యతిరేకించలేదు

పవన్ వ్యతిరేకించలేదు

తమ్ముడు పవన్ మోడీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించలేదని, అయితే ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా తనగి జాగ్రత్తలు తీసుకోలేదు అని మాత్రమే అన్నారు... అని నాగబాబు చెప్పుకొచ్చారు.

పవన్ షేర్ చేసిన సాయి మాధవ్ కవితను ఖండన

పవన్ షేర్ చేసిన సాయి మాధవ్ కవితను ఖండన

ఇటీవల పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ద్వారా....పెద్ద నోటు రద్దుపై సామాన్యుడి స్పందన అంటూ తన మిత్రుడు సాయి మాధవ్ రాసిన కవితను షేర్ చేసారు. ‘మెతుకు మెతుకు పోగు చేసి ముద్ద పోగేస్తే... దొంగకూడంటున్నారన్నా నేనెట్టా బ్రతికేది' అంటూ కవిత షేర్ చేసారు. రచయితలు అలానే రాస్తారు, సాయి మాధవ్ నాకు కూడా చాలా క్లోజ్. కవితలో రాసినంతగా ఏమీ లేదు పరిస్థితి అన్నారు నాగబాబు.

ప్రజారాజ్యం ఫెయిల్యూర్ మీద

ప్రజారాజ్యం ఫెయిల్యూర్ మీద

ప్రజారాజ్యం ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం... తమకు రాజకీయ అనుభవం లేక పోవడం ఒకటైతే... పార్టీని పూర్థి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తగిన సమయం కూడా లేక పోవడం మరోకారణం. ఎన్నికలకు జరుగడానికి కనీసం మూడు నుండి 5 సంవత్సాల ముందు పార్టీని పెట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని నాగబాబు అభిప్రాయ పడ్డారు.

ప్రజలు కూడా కరప్ట్ అయ్యారు

ప్రజలు కూడా కరప్ట్ అయ్యారు

అవినీతి రాజకీయ నాయకులు ప్రజలను కూడా కరప్ట్ చేసారు. అందరినీ నేను ఇలా అనడం లేదు... కానీ చాలా వరకు ప్రజలు కరప్ట్ అయ్యారు. ఓటేయడానికి డబ్బులు తీసుకోవడం తమ హక్కుగా భావించే పరిస్థితి వచ్చింది. అందుకే ఈ దేశం నాశనం అయిపోతోంది. ఇలాంటి సమయంలో మోడీ మాదిరిగా... ఒక నియంత తరహాలో నిర్ణయాలు తీసుకునే వాడు వచ్చినప్పుడే దేశానికి మంచి జరుగుతుందని నాగబాబు అభిప్రాయ పడ్డారు.

నా అభిప్రాయం... అన్నయ్యకు, తమ్ముడికి ఇబ్బంది ఉండదు

నా అభిప్రాయం... అన్నయ్యకు, తమ్ముడికి ఇబ్బంది ఉండదు

మోడీ తీసుకున్న నిర్ణయం మీద నా అభిప్రాయం నేను చెప్పాను. దీని వల్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్న అన్నయ్యకో, జనసేన పార్టీ నడుపుతున్న తమ్ముడికో ఇబ్బంది కర పరిస్థితి ఏర్పడుతుందని నేను అనుకోవడం లేదు.... నేను కాంగ్రెస్ పార్టీ సాధారణ సభ్యుడిగా ఉన్నప్పటికీ మోడీ లాంటి వారు మంచి నిర్ణయాలు తీసుకున్నపుడు సమర్థిస్తాను అని నాగబాబు తెలిపారు.

అన్నయ్య రాజకీయాల్లోకి వచ్చిందే అందుకు

అన్నయ్య రాజకీయాల్లోకి వచ్చిందే అందుకు

అవినీతి రాజకీయ నాయకుల కారణంగా వ్యవస్థ కుల్లి పోతుందని, దాన్ని మార్చాలనే ఉద్దేశ్యంతోనే అన్నయ్య రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజలకు సేవ చేయాలని వచ్చారు. అన్నయ్య ఎంత క్లీన్ ఇమేజ్ ఉన్నవాడో అందరికీ తెలుసు. కానీ ప్రజలు ఏం చేసారు? ఆయన పార్టీని ఎందుకు గెలిపించలేదు?.... వ్యవస్థ ఇలా తయారు కావడానికి ప్రజలు కూడా ఓకారణమే అని నాగబాబు అన్నారు.

పవన్ కళ్యాణ్ జనసేన గురించి

పవన్ కళ్యాణ్ జనసేన గురించి

ఓ ప్రశ్నకు.... నాగబాబు స్పందిస్తూ పవన్ కళ్యాణ్ అభిమానులు పెట్టమంటే పార్టీ పెట్టలేదు, కేవలం అభిమానుల కోసం ఇదంతా చేయడంలేదు, వాడు మా అందరి కంటే కాస్త తేడా, ఉన్నతమైన భావాలు కలిగిన వాడు, వాడు ఎవరు చెప్పినా వినడు, వాడికి ఏదైనా చేయాలనిపిస్తే చేస్తాడు, రేర్ హ్యూమన్ బీయింగ్ అన్నారు నాగబాబు.

పవన్ సినిమాలు చేస్తూ రాజకీయాలు చేయడంపై

పవన్ సినిమాలు చేస్తూ రాజకీయాలు చేయడంపై

పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు చేస్తూ రాజకీయాలు చేయడంపై స్పందిస్తూ..... వాడి దగ్గర అసలు డబ్బు లేదు, ఇప్పటి వరకు ఏమీ సంపాదించుకోలేదు, వాడు బ్రతకడానికి డబ్బులు అవసరం, అందుకే సినిమాలు చేస్తున్నాడు అని నాగబాబు చెప్పుకొచ్చారు.

అన్నయ్య, తమ్ముడు హెల్ప్ చేసారు

అన్నయ్య, తమ్ముడు హెల్ప్ చేసారు

ఒకానొక సందర్భంలో నేను జీరో నుండి మైనస్ లోకి పడిపోయాను. అప్పుల్లో కూరుకుపోయాను. ఆత్మహత్య చేసుకోవాలనే థాట్ వచ్చింది కానీ... అలాంటి ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు, అప్పుడు అన్నయ్యగారు, తమ్ముడు ఇద్దరూ నాకు ఎంతో సపోర్టు ఇచ్చారు అని నాగబాబు తెలిపారు.

రామ్ చరణ్ సినిమా వల్ల కాదు

రామ్ చరణ్ సినిమా వల్ల కాదు

రామ్ చరణ్ ఆరెంజ్ వల్ల నేను నష్టపోయాను అనేది వాస్తవం కాదు. ఆ సినిమాకు చేయాల్సిన బిజినెస్ ముందే చేసాం. అప్పటి ఆర్థిక సమస్య వేరు, చరణ్ కి నేను ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ కూడా ఇవ్వలేదు. ఫ్యూచర్లో ఇవ్వడానికి ట్రైచేస్తాను అన్నారు నాగబాబు.

English summary
Mega brother Nagababu interview about Politics, Cinema, Pawan kalyan, Chiranjeevi and Demonisation.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu