For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లస్ట్, వల్గర్ ఏముంది?, అనసూయ హల్క్, నాగబాబు పూ..., రోజా స్పైస్ గర్ల్: బోల్డ్‌గా చెప్పేసిన రష్మి

By Bojja Kumar
|

యాంకర్ రష్మి త్వరలో 'నెక్ట్స్ నువ్వే' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు, తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Sai Dharam Tej - Niharika marriage Rumoursఏ దరిద్రుడో ఇలా, బూతు అంటే ఒప్పుకోను. నిహారికపై

ఏ విషయాన్ని అయినా నిర్మొహమాటంగా చెప్పే రష్మి.... ఈ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలకు చాలా బోల్డ్‌గా సమాధానాలు చెప్పింది. సినిమాల్లో లస్ట్, వల్గారిటీ లాంటి వాటిపై ఆమె తన అభిప్రాయాలను తెలిపారు.

లవ్, లస్ట్ అన్నీ ఉంటాయి

లవ్, లస్ట్ అన్నీ ఉంటాయి

‘నెక్ట్స్ నువ్వే' మూవీ ఎలాంటి చిత్రం అనే ప్రశ్నకు రష్మి సమాధానం చెబుతూ.... ఇది ఆల్ మిక్డ్స్ సినిమా. అన్ని ఎమోషన్స్, అన్ని జోనర్స్ ఉంటాయి. థ్రిల్లర్, హారర్, కామెడీ, వార్, లవ్, లస్ట్, జెలసీ అన్ని ఉంటాయని తెలిపారు.

గ్లామర్ రోల్స్ చేయడానికి ఇబ్బంది లేదు కానీ...

గ్లామర్ రోల్స్ చేయడానికి ఇబ్బంది లేదు కానీ...

గుంటూరు టాకీస్ తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి. అందులో ఐటం సాంగ్స్ ఎక్కువగా ఉన్నాయి. అలాంటి గ్లామరస్ రోల్స్ చేయడానికి నాకు ఏమీ ఇబ్బంది లేదు. మంచి ప్రొడక్షన్ హౌస్, మంచి దర్శకుడు అయితే చేస్తాను. అలాంటి రోల్స్ విషయంలో ప్రజంటేషన్ అనేది చాలా ముఖ్యం అని రష్మి తెలిపారు.

గ్లామర్, వల్గారిటీ...

గ్లామర్, వల్గారిటీ...

గ్లామర్‌కు, వల్గారిటీకి చిన్న గీత మాత్రమే ఉంటుంది. కొంచెం అటు దాటితే అది వల్గర్ అవుతుంది. అందుకే సెన్సబులిటీతో చూపించే మంచి డైరెక్టర్, మంచి బేనర్ కావాలి అని ఎదురు చూశాను. అందుకే గుంటూరు టాకీస్ తర్వాత చాలా టైమ్ తీసుకున్నాను... అని రష్మి తెలిపారు.

గ్లామర్ అని చెప్పి వల్గర్ చేశారు కొందరు

గ్లామర్ అని చెప్పి వల్గర్ చేశారు కొందరు

గ్లామర్ అని ఒప్పించి వల్గారిటీ వైపు మిమ్మల్ని తీసుకెళ్లారా? అనే ప్రశ్నకు రష్మి స్పందిస్తూ... గుంటూరు టాకీస్ వల్గర్ ఏమీ లేదు. నాతో పాటు ఎవరికీ అనిపించలేదు. ఎంతో అందంగా నన్ను చూపించారు. నాకు పర్సనల్‌గా వల్గర్ అనిపించిన సందర్భాలు మిగతా సినిమాల్లో ఉన్నాయి. వాటి గురించి నేను క్లియర్ గా, ఓపెన్ గా చెప్పాను. ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు అని ఓపెన్ గా గతంలో చెప్పాను అని రష్మి తెలిపారు.

దాంట్లో లస్ట్ ఏముంది? వల్గర్ ఏముంది?

దాంట్లో లస్ట్ ఏముంది? వల్గర్ ఏముంది?

‘నెక్ట్స్ నువ్వే' ట్రైలర్ చూస్తుంటే రష్మి క్యారెక్టరైజేషన్లో కాస్త లస్ట్ ఉన్నట్లు కనిపిస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయనే ప్రశ్నకు రష్మి తనదైన రీతిలో స్పందించారు. ట్రైలర్లో చాలా సింపుల్ డైలాగులు చూపించారు. నీకు గడ్డివాము దగ్గర కుక్కగురించి తెలుసు, అది తినదు, ఇంకొకరిని తిననివ్వదు అనే డైలాగ్ అది. దాంట్లో లస్ట్ ఏముంది? వల్గర్ ఏముంది? అని రష్మి ఎదురు ప్రశ్నించారు.

అలాంటిది క్రియేట్ చేసుకున్నందుకు హ్యాపీ

అలాంటిది క్రియేట్ చేసుకున్నందుకు హ్యాపీ

ఎవరైనా ఉండనివ్వండి, ఉండక పోవనివ్వండి.... సినిమాలో రష్మి ఉందంటే జనాలు థియేటర్లకు వెలుతున్నారు. ఇలాంటిది నేను క్రియేట్ చేసుకున్నందుకు ఆనందంగా ఉంది.... అని రష్మి తెలిపారు.

పూర్తిగా భిన్నంగా ఉంటాను

పూర్తిగా భిన్నంగా ఉంటాను

నా ఆన్ స్క్రీన్ పర్సనాలిటీకి, ఆఫ్ స్క్రీన్ పర్సనాలిటీకి ఎలాంటి సంబంధం ఉండదు... అని రష్మి ఓ ప్రశ్నకు సమాధానం చెప్పింది.

అనసూయను జబర్దస్త్ నుండి పంపలేదు

అనసూయను జబర్దస్త్ నుండి పంపలేదు

అనసూయను నేను జబర్దస్త్ నుండి పంపలేదని, తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని, ఇద్దరం ఎంతో స్నేహంగా ఉంటామని రష్మి తెలిపారు. ఇద్దరి మధ్య పోటీ ఉన్నా ఎవరి ప్లేస్ వాళ్లదే అని రష్మి తెలిపారు.

నాగబాబు, రోజా, అనసూయలను వాటితో పోల్చిన రష్మి

నాగబాబు, రోజా, అనసూయలను వాటితో పోల్చిన రష్మి

ఈ సందర్భంగా అనసూయ, నాగబాబు, రోజా, సుడిగాలి సుధీర్ లను రష్మి కార్టూన్లతో పోల్చారు. అప్పుడప్పుడు అనసూయలో హల్క్ కనిపిస్తుంటాడని, రోజా స్పైస్ గర్ల్స్ లా ఉంటుందని, సుడిగాలి సుధీర్ జానీ బ్రావోలా ఉంటాడని అనసూయ తెలిపారు. మరి నాగబాబు ఎలా ఉంటారు అంటే...... విననీ ది పూ (హ్యూజ్ టెడ్డీబేర్) లా ఉంటారని, పూ ఈజ్ లైక్ దట్ నాగ బాబు సార్ అంటూ రష్మి సమాధానం ఇచ్చారు.

బిగ్ బాస్ 2 అవకాశం వచ్చినా వెళ్లను

బిగ్ బాస్ 2 అవకాశం వచ్చినా వెళ్లను

బిగ్ బాస్ అవకాశం వచ్చినా యాక్సెప్ట్ చేయను. అలాంటి ఐసోలేషన్లో నేను ఉండలేను. దాని కంటే ముఖ్యం నేను నిజ జీవితంలో ఎలా ఉంటానో బయటకు చెప్పడం ఇష్టం లేదు... అని రష్మి తెలిపారు.

అడల్ట్ మూవీ, పిల్లలను తీసుకురావొద్దు

అడల్ట్ మూవీ, పిల్లలను తీసుకురావొద్దు

నెక్ట్స్ నువ్వే సినిమాలో హారర్ ఉంది. ఎ సర్టిఫికెట్ వచ్చింది. ఈ సినిమాకు పిల్లలను తీసుకునిరావొద్దు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను మీరు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఆ మాత్రం అయితే గ్యారంటీ ఇస్తాను. సినిమా మొదటి నుండి చివరి వరకు, క్లైమాక్స్ లో కూడా నవ్వుతారు.. అని రష్మి తెలిపారు.

English summary
Anchor turned actress Rashmi Gautham has been coming before the audience with a movie called Next Nuvve. In an exclusive interview with a popular Telugu News Channel, the actress has opened up about her upcoming film and the characterization role. The actress revealed that the movie is a multi zoner film.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more