Just In
Don't Miss!
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆ రెండూ నాకు అవి నేర్పించాయి.. వామ్మో నాగబాబు రచ్చ మామూలుగా లేదుగా
మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న సంగతి తెలిసిందే. ట్రెండీగా రెడీ అవుతూ నేటి జనరేషన్‌కు తగ్గట్టు రచ్చ చేస్తుంటాడు. యూట్యూబ్‌లో నాగబాబు చెప్పే మాటలు కూడా తెగ వైరల్ అవుతుంటాయి. రీసెంట్‌గా నాగబాబు మీద భారీగానే ట్రోలింగ్ జరిగింది. ఒకరికి బర్త్ డే విషెస్ చెప్పబోయి.. ఇంకొకరి ఫోటో షేర్ చేశాడు. తాజాగా మరో ట్రెండీ ఫోటోను షేర్ చేశాడు.

బర్త్ డే విషెస్..
నాగబాబు ఈ మధ్య సోషల్ మీడియాలో సెలెబ్రిటీలకు బర్త్ డే విషెస్‌లను చెబుతూ పోస్ట్‌లు పెడుతుంటాడు. అలాగే నిన్న కూడా పోస్ట్‌లు పెట్టాడు. ఏఆర్ రెహ్మాన్ బర్త్ అంటూ ఓ పోస్ట్ పెడుతూ.. ఫోటోలను షేర్ చేశాడు. ఇక కపిల్ దేవ్ బర్త్ డే అంటూ రణ్ వీర్ సింగ్ ఫోటోను షేర్ చేశాడు. 83 సినిమా పోస్టర్ అని తెలీక కపిల్ దేవ్ అని భ్రమ పడ్డాడు.

ట్రోలింగ్ దెబ్బకు డిలీట్..
అలా నాగబాబు చేసిన పోస్ట్‌పై నెటిజన్లు విపరీతమైన కామెంట్లు పెట్టేశారు. రకరకాలుగా స్పందించడంతో నాగబాబు ఆ పోస్ట్‌ను డిలీట్ చేసి పడేశాడు. రణ్ వీర్ సింగ్‌కు కపిల్ దేవ్‌కు తేడా తెలీదా? అంటూ నాగబాబును ట్రోల్ చేశారు. కానీ తాజాగా నాగబాబు షేర్ చేసిన ఫోటో మాత్రం తెగ వైరల్ అవుతోంది.

ట్రెండీ ఫోటో..
నాగబాబు తాజాగా ఓ ఫోటోను షేర్ చేశాడు. అందులో నాగబాబు పెప్పర్ లుక్, మ్యూజిక్ వింటూ కారులో ట్రావెల్ చేస్తున్నాడు. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీనికి తోడు నాగబాబు చేసిన కామెంట్స్ కూడా ఫుల్ వైరల్ అవుతున్నాయి. ప్రయాణం, సంగీతం తనకు కొన్ని నేర్పించాయని చెప్పుకొచ్చాడు.

అవే నేర్పించాయి..
నీది నువ్ ఎప్పుడైనా కోల్పోతే.. మళ్లీ అడుగులు మొదలుపెట్టు.. నువ్ ఎక్కడ ప్రయాణాన్ని మొదలుపెట్టావ్ నీకు తెలుస్తుంది.. ప్రస్తుతం నువ్ ఎక్కడున్నావ్ అన్నది కూడా తెలుస్తుంది.. అని ప్రయాణం నాకు నేర్పించింది. ప్రపంచం మొత్తం నిశ్శబ్దంగా అయిపోయిందని ఎప్పుడైతే అనుకుంటావో.. అప్పుడు సంగీతాన్ని వింటే ప్రకృతి స్వరం వినిపిస్తుందనేది సంగీతం నేర్పించిందని నాగబాబు చెప్పుకొచ్చాడు.