నాథూరామ్ గాడ్సే నిజమైన దేశభక్తుడు.. అప్పట్లో మీడియా అలా చేసింది.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు
మెగా బ్రదర్ నాగబాబు చేసే పోస్ట్‌లు, పెట్టే కామెంట్స్ చూస్తుంటే కొంత ఆర్జీవీ పూనినట్టు అనిపిస్తూ ఉంటుంది. సినీ,రాజకీయ విషయాలను విశ్లేషించడానికి, తన అభిప్రాయాలను పంచుకోవడానికి యూట్యూబ్ ఛానెల్‌ను వాడుకుంటున్నాడు. ఇలా టెక్నాలజీని వాడుకుంటూ.. తన వ్యూస్‌ను ప్రజలు, అభిమానులతో పంచుకుంటున్నాడు. నా ఛానెల్ నా ఇష్టం పేరిట యూబ్యూబ్‌లో పెట్టే వీడియోలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. నాగబాబు వేసే ట్వీట్స్ సైతం ఓ రేంజ్‌లు పేలుతుంటాయి.
Recommended Video

సోషల్ మీడియాలో యాక్టివ్..
మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. సినీ, రాజకీయ విషయాలపై తన బాణీలను వినిపిస్తూ ఉంటాడు. ప్రస్తుతం కరోనా వైరస్, దేశ స్థితిగతులు, రాజకీయ పార్టీల పనితీరుపై కామెంట్స్ చేస్తూ ఉన్నాడు.

కరోనా వైరస్‌పై వరుస ట్వీట్స్..
కరోనా వైరస్ విజృంభించిన సమయంలో రోజూ ఏదో ఒక ట్వీట్ చేస్తూనే ఉండేవాడు. దీని నుంచి ఏ దేవుడు కూడా కాపాడలేడు.. ఏం పీకలేరంటూ కేవలం వైద్యులే కాపాడాలి అందుకే హాస్పిటల్స్ మాత్రమే తెరిచి ఉన్నాయ్ దేవాలయాలు మూసి ఉన్నాయని సెటైర్స్ వేసేవాడు. మద్యం షాపులు ఓపెన్ చేయడంపైనా నాగబాబు ఫైర్ అయ్యాడు. తాజాగా నాథూరామ్ గాడ్సేను సమర్దిస్తూ ఓ పోస్ట్ చేశాడు.

కాంట్రవర్సీ ట్వీట్..
జాతిపిత మహాత్మ గాంధీజీని చంపిన నాథూరామ్ గాడ్సేను ఇండియాలో కొంతమంది దేశభక్తుడిగా కొలుస్తారు. తాజాగా నాగబాబు అదే ధోరణిలో ఓ ట్వీట్ చేశాడు. ఈ రోజు నాథూరాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశ భక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కాదా? అనేది చర్చనీయాంశం. కానీ, అతని వైపు వాదనను ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే)' అని చెప్పారు.

ఆయన దేశభక్తిని శంకించలేం...
'గాంధీని చంపితే ఆపఖ్యాతి పాలవుతానని తెలిసినా తను అనుకున్నది చేశాడు. కానీ, నాథూరాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తు చేసుకోవాలనిపించింది. పాపం నాథూరాం గాడ్సే. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్' అని ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











