చిల్లర దొంగలు... కుక్కల్లా మొరుగుతూ.. పోసాని, నాని, ఏపీ ప్రభుత్వంపై ఘాటుగా స్పందించిన నాగబాబు!

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌‌పై సినీ రచయిత, నటుడు, వైపీసీ కార్యకర్త పోసాని కృష్ణమురళీ మాటల దాడి తర్వాత మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. అయితే పవన్ అనుకూల వర్గం పోసాని తప్పు అంటే.. వైసీపీ మద్దతు దారులు పోసాని మాట్లాడిన విషయంలో తప్పేమి లేదని వాదిస్తున్నారు. ఇలాంటి ఉద్రిక్త సమయంలో ఇన్స్‌టాగ్రామ్‌లో మెగా బ్రదర్ నాగబాబు Ask me ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. నెటిజన్లు వేసిన ప్రశ్నకు ఆయన మీమ్స్ రూపంలో సమాధానాలు ఇస్తూ..

మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారా?

మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారా?

మీరు మళ్లీ రాజకీయాల్లో వాస్తారా అంకుల్ అంటూ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఇటీవల వైరల్ అయిన ఓ న్యూస్ యాంకర్ ఫోటో పెట్టి నాకు ఇంట్రెస్ట్ పోయింది అంటూ కామెంట్ చేశారు. ఇక సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం ఎలా ఉందనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఆయన త్వరగా కోలుకొంటున్నారు. కొద్ది రోజుల్లోనే మన ముందుకు వస్తారు అని నాగబాబు చెప్పారు.

పవన్ కల్యాణ్ గురించి మీ అభిప్రాయం ఏమిటి?

పవన్ కల్యాణ్ గురించి మీ అభిప్రాయం ఏమిటి?

పవన్ కల్యాణ్ గురించి మీ మాటల్లో ఏం చెబుతారు అని నెటిజన్ అడిగిన ప్రశ్నకు పోసాని గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూ క్లిప్లింగ్‌ను పోస్టు చేశారు. పవన్ కల్యాణ్ గురించి పోసాని మాట్లాడుతూ.. పవర్ స్టార్ సినిమాల్లోకి వస్తే బ్లాంక్ చెక్ ఇస్తాను. 40 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తాను. కావాలంటే నేను బ్లాంక్ చెక్ ఇస్తాను. ఇండియాలోనే టాప్ హీరో. ఆయనకు లంగా పనులు చేయడం రాదు అంటూ పోసాని చెప్పిన విషయాలను వీడియో రూపంలో పోస్టు చేశారు.

పోసాని కృష్ణమురళీ గురించి ఒక్కమాటలో

పోసాని కృష్ణమురళీ గురించి ఒక్కమాటలో

పోసాని గురించి ఒక్క మాట చెప్పండి అంటూ నాగబాబును అడిగితే.. బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి చిత్రంలోని ఓ ఫోటో పెట్టారు. ఆ సీన్‌లో బాలకృష్ణతో సహ నటుడు మాట్లాడుతూ.. వాడు అరుస్తున్నాడురా... అంటే కొన్ని కుక్కలు అలానే మొరుగుతుంటాయి అంటూ బాలయ్య చెప్పే డైలాగ్‌ను పోస్టు చేశారు. ప్రస్తుతం నాగబాబు మీమ్స్ రూపంలో చెప్పిన సమాధానాలు ఆసక్తికరంగా మారాయి.

ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల అమ్మకాల గురించి

ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల అమ్మకాల గురించి

సార్.. ఆంధ్ర ప్రదేశ్‌లో టికెట్ల అమ్మకాల గురించి మీ ఒపీనియన్ ఏమిటి సార్ అనే ప్రశ్నకు విక్రమార్కుడు చిత్రంలో రవితేజ, బ్రహ్మనందం చిల్లర దొంగతనం చేసి చెట్టుకింద డబ్బులు పంచుకొనే సీన్ వీడియో రూపంలో పోస్టు చేశారు. వీడియోలో రవితేజతో బ్రహ్మానందం మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా సరిగా పంచావా అంటూ ఏడుస్తూ అడుగుతూ మోసం చేస్తే పాపం తగులుతుంది అంటే.. మనం చేసే గుడిలో పూజ చేస్తున్నామా అంటూ రవితేజ సమాధానం ఇచ్చే సీన్‌ను పోస్ట్ చేశారు.

సన్నాసి నాని గురించి ఓ మాట చెప్పండి అంటే. .

సన్నాసి నాని గురించి ఓ మాట చెప్పండి అంటే. .


సన్నాసి నాని గురించి ఒక మాట చెప్పండి అంటే.. గుండెల్లో గోదారి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మోహన్ బాబు చేసిన ప్రసంగం వీడియోను షేర్ చేశారు. ప్రపంచంలో ఎన్ని అవార్డులు ఉంటే.. అన్ని అవార్డులు నా బిడ్డకే రావాలి. ఆమె ఎవరు చేయని విధంగా నటించింది. ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉంది. అయ్యప్ప స్వామి సాక్షిగా చెబుతున్నా.. ఇప్పటి వరకు ఇలా నటించడం నేను ఎవరినీ చూడలేదు అంటూ మోహన్ బాబు చెప్పిన వీడియోన మీమ్ షేర్ చేశారు.

రిపబ్లిక్ ఫంక్షన్‌లో పవన్ స్పీచ్ గురించి

రిపబ్లిక్ ఫంక్షన్‌లో పవన్ స్పీచ్ గురించి

రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో పవన్ కల్యాణ్ గారి స్పీచ్‌కు మీ స్పందన ఏమిటి సార్ అని ఓ నెటిజన్ ప్రశ్న వేయగా.. కింగ్ సినిమాలో బ్రహ్మనందంతో కమెడియన్ శ్రీనివాసరెడ్డి చెప్పిన డైలాగ్ వీడియోను పోస్టు చేశారు. ఆ సీన్‌లో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఇక శివమణి జాస్ కొట్టినట్టు.. ఒక జాకీర్ హుస్సేన్ తబలా వాయించినట్టు.. శంకర్ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ వాయించినట్టు.. కొట్టుడు.. పాడిచ్చుడు.. అసలు ఒక మాటలో చెప్పాలంటూ అనే డైలాగ్స్‌ను తన స్పందనగా చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో పాలన ఎలా సాగుతుంది?

ఆంధ్రప్రదేశ్‌లో పాలన ఎలా సాగుతుంది?

ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన గురించి మీ అభిప్రాయం ఏమిటి సార్ అనే ప్రశ్నకు నాగబాబు విక్టరీ వెంకటేష్ నటించిన సినిమాలోని వీడియోను షేర్ చేశారు. చిల్లర దొంగలుగా వెంకటేష్, సుధాకర్ కొట్టేసిన సొమ్మును ఆలయానికి తీసుకొచ్చి.. చెంబులోని చిల్లర డబ్బులను పైకి ఎగురవేస్తాను. అది పైనుంచి కొంచెం కింద పడిన అవి నాకే స్వామి అంటూ వెంకీ చెప్పిన డైలాగ్‌ను నెటిజన్ ప్రశ్నకు సమాధానం వెల్లడించారు.

Recommended Video

Athadu Ame Priyudu Movie Launch| Nagababu | Yandamuri Veerendranath | Kaushal | Filmibeat Telugu
నా బిడ్డ ప్రియాంక సింగ్ అంటూ..

నా బిడ్డ ప్రియాంక సింగ్ అంటూ..

బిగ్‌బాస్ లేదా ఐపీఎల్‌లో మీకు ఏది ఇష్టం అని నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. బిగ్‌బాస్ చూడకుండా ఐపీఎల్ చూస్తూ.. నా బిడ్డ లాంటి ప్రియాంక సింగ్‌కి సపోర్ట్ చేస్తే.. ఈ సమాజం హర్షించదు అంటూ నాగబాబు మరో మీమ్‌ను షేర్ చేశాడు. అలాగే ఏపీలో మద్యం బ్రాండ్లు గురించి సెటైర్లు వేశాడు. మీకు ఏ బ్రాండ్ ఇష్టమంటే.. ప్రసిడెంట్ గ్యాలరీ అవార్డులు, బూమ్ బూమ్ అనే బ్రాండ్ల ఫోటోలు షేర్ చేశారు. ఇంకా ఈ చాలా ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X