పెదవి విప్పని నాగేంద్రబాబు!
రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ఊహాగానాలకు కారణమైన చిరంజీవి పార్టీ విషయమై మాట్లాడడానికి చిరంజీవి సోదరుడు నాగేంద్రబాబు నిరాకరించారు. చిరంజీవి రాజకీయాలలోకి ఎప్పుడు వస్తారు...పార్టీ పెడతారా తదితర ప్రశ్నలకు తాను సమాధానం చెప్పలేనన్నారు...రాజకియాలలోకి వచ్చే విషయంపై ముహూర్తం కూడా ఏమీ నిర్ణయించలేదని అయన అన్నారు. తమ సోదరుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపచేస్తామని, దీనికోసం ఎజెండా, విధివిధఆనాలు రూపొందిస్తున్నామని నాగేంద్రబాబు చెప్పారు. ప్రజాసేవ కోసం స్థాపించిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేసి, సేవా కార్యక్రమాలతో అన్ని జిల్లాలకు విస్తరింపజేస్తామన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించడానికి సోమవారం నాగేంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడేనికి వచ్చారు. బాధిత కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించారు.


Click it and Unblock the Notifications











