twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గరికపాటి వివాదంపై మరోసారి నాగబాబు రియాక్షన్.. మాకు అలాంటి కోరిక లేదంటూ...

    |

    ప్రముఖ ఆధ్యాత్మికత ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అలాగే మెగా అభిమానుల్లో కూడా కొంత అసంతృప్తిని కూడా క్రియేట్ చేసింది. ఇక సోషల్ మీడియాలో గరికపాటి నరసింహారావుకు సంబంధించిన అనేక రకాల కామెంట్స్ కూడా వైరల్ గా మారుతున్నాయి. ఆయన అలా తొందరపడి మాట అనాల్సింది కాదు అని కూడా చాలామంది ప్రముఖులు వారి అభిప్రాయాన్ని తెలియజేశారు.

    నాంపల్లి లో బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో జరిగిన అలయి బలాయి కార్యక్రమంలో చాలామంది రాజకీయ ప్రముఖులు సెలబ్రిటీలు పాల్గొన్నారు. అయితే ఆ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రత్యేక అతిధిగా వెళ్లారు. ఇక అప్పుడే అదే స్టేజిపై ప్రముఖ ప్రవచనాకర్త ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహారావు తన ప్రసంగానే మొదలుపెట్టారు ఇక ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవితో ఫోటోలు దిగేందుకు కొంతమంది మహిళలు పోటీపడ్డారు. ఈ క్రమంలో వారిని నొప్పించకుండా మెగాస్టార్ అందరికీ ఒకే తరహాలో గ్రూప్ ఫోటో ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

    Nagababu once again clarification on garikapati narasimha rao comments

    ఇక అప్పుడు గరికపాటి నరసింహారావు గారు వెంటనే చిరంజీవి గారు ఫోటో సెషన్ ఆపేసి ఇక్కడ పక్కన వచ్చి కూర్చోవాలి అని చెప్పారు. లేదంటే తాను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని కూడా ఆయన అసహనం వ్యక్తం చేయడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారిపోయింది. ఇక ఇదే విషయంపై నాగబాబు కూడా పరోక్షంగా గరికపాటి పై ట్వీట్ చేసిన విధానం వైరల్ అయింది.

    అయితే ఇప్పుడు మెగా అభిమానులు సీరియస్ అవుతూ ఉండడంతో నాగబాబు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. గరికపాటి వారు ఏదో మూడ్ లో ఆలా అనివుంటారు అని, అయన లాంటి పండితుడు ఆలా అనివుండకూడదని అయన అర్థం చేసుకోవాలి అని అన్నామే తప్ప, ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని మాకు కోరిక లేదు. ఏది ఏమైనా మన మెగాభిమానులు ఆయనని అర్థం చేసుకోవాలి గాని ఆయనని ఎవరు తప్పుగా మాట్లాడవద్దని మెగాభిమానులకు నా రిక్వెస్ట్.. అని నాగబాబు క్లారిటీ ఇచ్చారు.

    English summary
    Nagababu once again clarification on garikapati narasimha rao comments
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X