అరవింద సమేతలో మెగా బ్రదర్.. పవర్ ఫుల్ రోల్‌లో మాస్ డైలాగ్స్!

ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం అరవింద సమేత. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనివున్నాయి. ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదలై అంచనాలు అమాంతం పెంచేసింది. ఎన్టీఆర్ ఈ చిత్రంలో సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించబోతున్నాడు. బలమైన యాక్షన్, ఆకట్టుకునే ఫ్యామిలీ అంశాలతో ఈ చిత్రం ఉండనుంది. అరవింద సమేత చిత్రం గురించి తాజాగా మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. మెగా బ్రదర్ నాగబాబు ఈ చిత్రంలో ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Recommended Video

Producer Radhakrishna Gifts Costly Car To NTR
 రాయలసీమ ఫ్యాక్షన్

రాయలసీమ ఫ్యాక్షన్

రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో అరవింద సమేత చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయిక లో వస్తున్న తొలి చిత్రం ఇది.

కీలక పాత్రలో నాగబాబు

కీలక పాత్రలో నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఫ్యాక్షన్ లీడర్ గా నాగబాబు కనిపిస్తారట. త్రివిక్రమ్ శ్రీనివాస్ నాగబాబు పాత్ర కోసం రాయలసీమ యాసలో మాస్ డైలాగ్స్ రాసినట్లు తెలుస్తోంది. నాగబాబు పాత్ర చిత్రం మొత్తం సాగుతుందని అంటున్నారు.

బిజీగా తమన్

బిజీగా తమన్

సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రాన్ని బాణీలు సమకూరుస్తున్నాడు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్న తమన్ ఎప్పటికప్పుడు చిత్ర విశేషాలని ఫ్యాన్స్ కు అందిస్తున్న సంగతి తెలిసిందే.

 దసరా బరిలో

దసరా బరిలో

అరవింద సమేత చిత్రం దసరా కానుకగా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హారిక అండ్ హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X