For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వాడంత వెధవ ఉండడు: సంచలనంగా మారిన నాగబాబు ట్వీట్

  |

  టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన శైలి సినిమాలతో చాలా తక్కువ సమయంలోనే ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు మెగా బ్రదర్ నాగబాబు. సుదీర్ఘ కాలంగా సినిమాల్లో ఉన్న ఆయన హీరోగా, సహాయ నటుడిగా, నిర్మాతగా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ క్రమంలోనే చాలా ఏళ్ల క్రితమే బుల్లితెరపైకి సైతం ఎంట్రీ ఇచ్చారు. అక్కడ కొన్ని సీరియళ్లలో నటించడంతో పాటు ప్రత్యేకమైన కార్యక్రమాలను కూడా చేశారు. ఇక, ఈ మధ్య కాలంలో పవర్ స్టార పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నాగబాబు చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే!

  అలా వచ్చి.. జనాలను అలరించి

  అలా వచ్చి.. జనాలను అలరించి

  చిరంజీవి నటించిన 'రాక్షసుడు' అనే సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు నాగబాబు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎన్నో సినిమాల్లో నటించారాయన. అంతేకాదు, నిర్మాతగానూ పలు సినిమాలను తీశారు. సుదీర్ఘమైన కెరీర్‌లో ఉత్తమమైన పాత్రలను చేసిన ఆయన.. కొన్ని సినిమాలను వన్ మ్యాన్ షోగా మార్చుకున్నారు. అంతలా మెగా బ్రదర్ తన హవాను చూపించారు.

  శివాత్మక రాజశేఖర్ అందాల జాతర: స్లీవ్‌లెస్ టాప్‌తో ఓ రేంజ్ ట్రీట్

  బుల్లితెరపైనా నాగబాబు సందడి

  బుల్లితెరపైనా నాగబాబు సందడి

  టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతోన్న నాగబాబు.. బుల్లితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే పలు సీరియళ్లలోనూ నటించారు. అదే సమయంలో కొన్ని షోలకు జడ్జ్‌గా వ్యవహరించారు. మరీ ముఖ్యంగా జబర్ధస్త్‌లో చాలా కాలం పాటు కొనసాగారు. ఆ తర్వాత పలు చానెళ్లు మారిన ఆయన.. ఎన్నో షోలను నడిపించారు. ఇలా ఇక్కడ కూడా సందడి చేశారు.

  అక్కడా.. ఇక్కడ కనిపించకుండా

  అక్కడా.. ఇక్కడ కనిపించకుండా


  చాలా కాలం పాటు అటు సినిమాల్లో, ఇటు టీవీలో తనదైన హవాను చూపించిన మెగా బ్రదర్ నాగబాబు.. ఈ మధ్య కాలంలో పెద్దగా సందడి చేయడం లేదు. గతంతో పోలిస్తే ఇప్పుడు సినిమాల సంఖ్యను తగ్గించిన ఆయన.. బుల్లితెరపైనా పెద్దగా షోలు చేయట్లేదు. దీంతో మెగా అభిమానులు తీవ్ర నిరాశను లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ మాలో అప్పుడప్పుడూ మెరుస్తున్నారు.

  ఏకంగా టాప్‌ను విప్పేసిన ప్రియాంక చోప్రా: అబ్బో ఆమె ఫోజు చూశారంటే!

  జనసేన కార్యక్రమాల్లో యాక్టివ్‌గా

  జనసేన కార్యక్రమాల్లో యాక్టివ్‌గా

  మెగా బ్రదర్ నాగబాబు.. పవర్ స్టార పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే తరచూ పర్యటలను చేస్తూ జనసేన పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.

  అందులో పోస్టులు.. వివాదాలతో

  అందులో పోస్టులు.. వివాదాలతో

  సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే నాగబాబు.. సమాజంలో జరిగే ఎన్నో విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. లోకల్ విషయాలతో పాటు జాతీయ స్థాయి అంశాలపైనా అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నోసార్లు వివాదాల్లోనూ చిక్కుకున్నారు. అయినప్పటికీ తన గొంతును నిర్భయంగా చెబుతుంటారు. తద్వారా తరచూ హైలైట్ అవుతున్నారు.

  ఒంటిపై నూలు పోగు లేకుండా నితిన్ హీరోయిన్ ఫోజులు: మరీ ఇంత పచ్చిగానా!

  వాడంత వెధవ ఉండడు అంటూ

  వాడంత వెధవ ఉండడు అంటూ

  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నాగబాబు.. నిత్యం తనదైన పోస్టులతో వార్తల్లో నిలుస్తూ ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మెగా బ్రదర్ తన ట్విట్టర్‌లో చేసిన పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది. ఇందులో ఆయన 'మనుషుల్ని వదులుకోవడానికి నేను ఇష్టపడను. ఒకవేళ ఎవరినైనా వదులుకున్నానంటే వాడంత వెధవ ఎవడూ ఉండడు' అంటూ రాసుకొచ్చారు.

  నాగబాబు అన్నది ఎవరిని అంటూ

  నాగబాబు అన్నది ఎవరిని అంటూ

  మెగా బ్రదర్ నాగబాబు ఏమి చేసినా దాని వెనుక బలమైన కారణం ఉంటుందన్న టాక్ ఉంది. అలాంటిది ఇప్పుడు ఆయన చేసిన ట్వీట్‌ ఎవరిని ఉద్దేశించి చేశారు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఫలానా వాళ్లను ఆయన టార్గెట్ చేశాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కానీ, మరికొందరు మాత్రం ఆయన క్యాజువల్‌గానే ఈ పోస్ట్ చేశారని అంటున్నారు.

  English summary
  Senior Actor, Mega Brother Nagababu Very Active in Social Media. Recently He Tweeted about Human Relations.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X