చిరునే రియల్ బాస్: పవన్ ఫ్యాన్స్‌కు నాగబాబు పంచ్!
ఓ టీవీ కార్యక్రమంలో నాగబాబు మాట్లాడుతూ...'అసలైన సాధకుడు అంటే అన్నయ్య చిరంజీవే. 24 ఏళ్ల వయసులోనే ఆయన చెన్నై వెళ్లారు. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా మెగాస్టార్‌గా ఎదిగారు. రాజకీయ పార్టీ స్థాపించారు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ప్రజలకు సేవ చేస్తున్నారు' అని వెల్లడించారు.
'పవన్ కళ్యాణ్ అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులరిటీ సొంతం చేసుకున్నాడు, కానీ చిరంజీవే లేకుంటే పవన్ కళ్యాణ్‌తో పాటు మేము ఎవరమూ కూడా ఇప్పుడు ఈ స్థాయిలో ఉండే వారంకాదు. చిరంజీవి వల్లనే మా ఫ్యామిలీ ఇండస్ట్రీలో ఈ స్థాయికి ఎదిగింది. చిరంజీవి అంటే నాకు ఎంతో ఇష్టం, అలాంటి సోదరుడిని కలిగి ఉన్నందుకు గర్విస్తున్నాను అన్నారు' అన్నారు.
నాగబాబు ఇలా తన ఇద్దరు స్టార్ సోదరుల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనక ప్రత్యేక కారణం ఉందని......కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులకు చురకలంటించేందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేసారి టాక్. ఇటీవల పలు సందర్భాల్లో పవన్ ఫ్యాన్స్ ప్రవర్తన అభ్యంతరకరంగా ఉండటం వల్లనే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసారని అంటున్నారు.
ఇటీవల జరిగిన పలు ఆడియో వేడుకలకు హాజరైన అభిమానులు చిరంజీవిని పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ రావాలంటూ గొడవ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మా అందరికీ రియల్ బాస్ చిరంజీవే, ఆయన తర్వాతే పవన్ కళ్యాణ్ అయినా ఇంకెవరైనా అని చెప్పేందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేసారట.


Click it and Unblock the Notifications












