ఐరన్‌లెగ్ కుటుంబాన్ని ఆదుకున్న నాగబాబు
దుర్భర దారిద్య్రం అనుభవించి ఇటీవల హఠాత్తుగా మరణించిన హాస్యనటుడు ఐరన్ లెగ్ శాస్త్రి కుటుంబాన్ని ఆదుకోడానికి చిరంజీవి తమ్ముడు నాగబాబు నడుం బిగించారు. శాస్త్రి కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారోనన్న పజిల్ చిక్కు వీడింది. ఆధ్యాత్మిక చింతన అధికంగా గల నాగబాబు ఒక మంచి పనికి చొరవ తీసుకోవడంతో బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు వంటి వారు తమ వంతు విరాళాలు ఇచ్చారు. మొత్తం 90 వేల రూపాయలు జమ కావడంతో నాగబాబు ఈనెల 26న తాడేపల్లి గూడెం వెళ్ళి శాస్త్రి కుటుంబ సభ్యులకు ఆ మొత్తాన్ని అందజేశారు. ఐరన్ లెగ్ శాస్త్రికి సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో భార్యా పిల్లలతో ఆయన తన స్వస్ధలమైన తాడేపల్లి గూడెం వెళ్ళిపోయారు. స్వతహాగా పురోహితుడైన శాస్త్రి మీద ఐరన్ లెగ్ ముద్ర పడడంతో ఆయనకు పౌరోహిత్య అవకాశాలు రాకుండా పోయాయి. రెంటికి చెడ్డ రేవడిలా మారిన శాస్త్రి తన భార్యా పిల్లలకు దారిద్య్రాన్ని మిగిల్చిపోయాడు.


Click it and Unblock the Notifications