twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలా చేస్తే చెప్పుతీసుకొని కొట్టాను.. నా కూతుర్ని ఇండస్ట్రీకి ఎందుకు పంపిస్తాను.. క్యాస్టింగ్ కౌచ్‌పై

    By Rajababu
    |

    Recommended Video

    Srireddy issue : Nagababu Clarifies To Media

    సినీ పరిశ్రమపై శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలు, క్యాస్టింగ్ కౌచ్‌పై గురించి వెల్లడిస్తున్న విషయాలు సంచలనం రేపుతున్న సమయంలో మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) తీవ్రంగా సీరియస్ అయింది. శ్రీరెడ్డి వ్యవహారంపై మా అసోసియేషన్ సభ్యులు నాగబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో శ్రీకాంత్, నటి హేమ ఇతర నటీనటులు పాల్గొన్నారు.

    ఆరోపణలు చేయవద్దు

    ఆరోపణలు చేయవద్దు

    క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మా సభ్యులు చర్యలు తీసుకొంటున్నారు. క్యాష్ కమిటి మా కమిటీ ఏర్పాటు చేసింది. ఇదంతా ఒకరోజులో పూర్తయ్యే విషయం కాదు. నిరాధారంగా మాపై ఆరోపణలు చేయవద్దు. అవగాహన లేకుండా విమర్శలు చేయవద్దు అని నాగబాబు అన్నారు.

    చెత్త వెధవలు ఉన్నారు

    చెత్త వెధవలు ఉన్నారు

    క్యాస్టింగ్ కౌచ్‌ను ఎప్పుడూ సమర్ధించను. నా ప్రొడక్షన్‌లో ఇలాంటి విషయాలు నా దృష్టికి వస్తే చెప్పుతీసుకొని కొట్టాను. గతంలో ఇది జరిగింది. ఇప్పుడు నేను ప్రచారం కోసం చెప్పడం లేదు. సినిమా పరిశ్రమలో 10 శాతం చెత్త వెధవలు ఉన్నారు. అది కాదని నేను చెప్పను. కానీ 90 శాతం మంది మంచి వాళ్లే ఉన్నారు అని నాగబాబు చెప్పారు.

     మహిళలు సెక్స్ వస్తువు కాదు..

    మహిళలు సెక్స్ వస్తువు కాదు..

    సినిమా పరిశ్రమ మంచిది కాకపోతే నా కూతురును ఇండస్ట్రీకి ఎందుకు పరిచయం చేస్తాను. మేము సినీ తారలను ఓ సెక్స్ వస్తువుగా ఎప్పడూ చూడను. మీకు ఏమైనా లైంగిక వేధింపులు ఎదురైతే ఫిర్యాదు చేయాలని చిన్న నటీనటులకు నేను ప్రతీసారి చెబుతాను. ఇక క్యాస్టింగ్ కౌచ్ కొత్తగా వచ్చింది కాదు అని నాగబాబు పేర్కొన్నారు.

     కనీస వసతులు లేవు

    కనీస వసతులు లేవు

    హీరో, హీరోయిన్లకు కార్‌వాన్లు ఉంటాయి. మిగితా నటీనటులకు కొన్ని సౌకర్యాలు ఉంటాయి. అవుట్‌డోర్ షూటింగ్‌లకు వెళితే మహిళలకు కనీస వసతులు ఉండవు. వారికి కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నిర్మాతలతో మాట్లాడాను. షూటింగ్ లొకేషన్లలో మహిళలకు టాయిలెట్లు, దుస్తులు మార్చుకొనేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకొంటున్నాం. వీటి ఏర్పాటుకు మైకుల ముందు సొల్లు మాట్లాడం నాకు చాత కాదు. పెద్దలతో మాట్లాడి చర్యలు తీసుకొంటాం.

    ఆడవాళ్లలో ధైర్యం రావాలి

    ఆడవాళ్లలో ధైర్యం రావాలి

    క్యాస్టింగ్ కౌచ్ అనేది అన్ని రంగాల్లో ఉంది. కేవలం సినిమా రంగానికి పరిమితం కాలేదు. టెలివిజన్ ఇండస్ట్రీలో ఉంది. కానీ అక్కడ తక్కువగా ఉండవచ్చు. అయితే క్యాష్ కమిటీ వంద వచ్చినా ఈ సమస్య పరిష్కారం కాదు. ఆడవాళ్లలో ధైర్యం రాకపోతే మీకు న్యాయం జరుగదు. ఎవడైనా తప్పుగా మాట్లాడితే లాగి చెప్పుతో దవడ పగలకొట్టండి.

    తెలుగు వాళ్లకే అవకాశం

    తెలుగు వాళ్లకే అవకాశం

    తెలుగు వాళ్లకే అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ నటిస్తున్న వారు తెలుగు వాళ్లు కాదా? అమెరికా నుంచి వచ్చారా? కొందరు హీరోయిన్లు, విలన్లు పరభాష నుంచి పెట్టుకొంటున్నారు. ఆ విషయం నిర్మాత ఇష్టం మేరకే ఉంటుంది. ఎందుకంటే నిర్మాతలు కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీస్తారు. వారి సినిమాలో ఎవరినీ పెట్టుకోవాలో.. పెట్టుకోవద్దో అది వారి ఇష్టం. ఎందుకంటే నిర్మాతలకు నష్టం వస్తే ఎవరు ఇస్తారు.

    ప్రాథమిక హక్కుకు భంగం

    ప్రాథమిక హక్కుకు భంగం

    భారతీయ సినిమా పరిశ్రమలో ఏ భాషకు చెందిన నటుడు ఎక్కడైనా నటించవచ్చు. కోటా శ్రీనివాసరావు తమిళంలో, హిందీలో నటించారు. శ్రీదేవి, సౌందర్య లాంటి వాళ్లు అన్ని భాషల్లో నటించారు. ఏ భాషలోనైనా నటించే హక్కు నటీనటులకు ఉంది. అదీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. వాటికి విరుద్దంగా ప్రవర్తించవద్దు.

    నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు

    నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు

    సినిమా పరిశ్రమపై కొందరు అవాకులు, చెవాకులు పేలుతున్నారు. ప్రతీదానికి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సినిమా పరిశ్రమలో లక్షలమంది పనిచేస్తున్నారు. అలాంటి పరిశ్రమపై ఆరోపణలు చేయవద్దు. సినిమాలో చెడు, సెక్స్ వల్ల జనం పాడైపోతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. సినిమాలో మంచిని ఎందుకు ఫాలో అవడం లేదు. సినిమా అంటే అన్ని అంశాలు ఉంటాయి. సినిమాల్లో చెడు ఉంటే వాటిని నియంత్రించేందుకు సెన్సార్ బోర్డు ఉంది.

    English summary
    Actor Nagababu reacted on recent development on film Industry in media. He speaks about allegations made on the Industry. He promised that he will take care of issues related to Industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X