ఇండస్ట్రీలో మేమే పెద్ద మాఫియా.. అల్లు అరవింద్ ఓ దావుద్ ఇబ్రహీం!

మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల సోషల్ మీడియా వేదికగా వరుస వీడియోలతో రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. రాజకీయ అంశాలపై నాగబాబు చేస్తున్న వీడియోలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. నాగబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో తరచుగా మాఫియా అంటూ వినిపిస్తున్న విమర్శలపై స్పందించారు. నాలుగు కుటుంబాలు మాఫీలా వ్యవహరిస్తున్నాయనే విమర్శలపై నాగబాబు తనదైన శైలిలో సరదాగా బదులిచ్చారు.

 ఆ నలుగురు

ఆ నలుగురు

అన్ని విషయాలపై విమర్శలు చేస్తున్న నాగబాబు..చిత్ర పరిశ్రమలో కొందరు మాత్రమే ఆధిపత్యం చలాయిస్తున్న అంశంపై ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్న ఎదురైంది. దీనికి నాగబాబు వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ ఉన్నాయి. మరోవైపు నిర్మాతలుగా అల్లు అరవింద్, దిల్ రాజు ఉన్నారు. ఇంతకు మించి మాఫియా ఉంటుందా అని నాగబాబు చమత్కరించారు.

పెద్ద మాఫియా మేమే

పెద్ద మాఫియా మేమే

ఇండస్ట్రీలో మేమే పెద్ద మాఫియా. మా అన్నయ్య చిరంజీవి ఓ చోటా రాజన్.. ఆలు అరవింద్ ఓ దావూద్ ఇబ్రహీం అంటూ నాగబాబు మరో చమత్కారం చేశారు. ఇక చిన్న సినిమాలకు జరుగుతుందనే అంశాలపై నాగబాబు మాట్లాడారు. చిన్న చిత్రాలు విడుదల కావడం లేదంటే అది డిస్ట్రిబ్యూటర్లకు సంబందించిన వ్యవహారం అని నాగబాబు తెలిపారు. ఈ చిత్రం విడుదలవుతోంది కాబట్టి మరో సినిమాని ఆపేయమని ఇండస్ట్రీలో ఎవరూ చెప్పరు.

వాళ్ళకి కూడా పరాజయాలు

వాళ్ళకి కూడా పరాజయాలు

చిత్ర పరిశ్రమ నలుగురు చేతుల్లోనే ఉన్నది వాస్తవం అయితే వారికి పరాజయం అనేదే ఉండకూడదు. కానీ వాళ్లకు కూడా ప్లాపులు ఎదురవుతున్నాయి కదా అని అన్నారు. కొన్ని థియేటర్స్ దిల్ రాజు, అల్లు అరవింద్ చేతుల్లో ఉన్న మాట వాస్తవం. అంత మాత్రాన వాళ్లకు ప్రత్యేకంగా పవర్ లేదని అభిప్రాయపడ్డారు.

 కథలో దమ్ము ఉండాలి

కథలో దమ్ము ఉండాలి

కొన్ని సమయాల్లోపెద్ద చిత్రాలు విడుదల కావు. అలాంటి సమయాల్లో చిన్న చిత్రాలని విడుదల చేసుకోవచ్చు. కాని బిజీగా ఉన్న సమయంలోనే రిలీజ్ చేయాలని భావిస్తారు. సినిమాలో దమ్ముంటే ఎలాగైనా ఆడుతుందని అన్నారు. ప్రస్తుత కాలంలో సినిమాలు 3 నుంచి నాలుగు వారాలు మాత్రమే ఆడుతున్నాయని నాగబాబు తెలిపారు. ఇటీవల సంక్రాంతికి విడుదలైన సినిమాల విషయంలో కుడా పెద్ద ఎత్తున రచ్చ జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X