వరుణ్ తేజ్ జనసేన పార్టీకి డబ్బు ఇచ్చింది అందుకా.. పిచ్చి కామెంట్స్‌పై నాగబాబు ఫైర్!

Recommended Video

Nagababu Reacts On Janasena Party Fund | Filmibeat Telugu

మెగా బ్రదర్ నాగబాబు తరచుగా సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ కామెంట్స్‌తో హీట్ పెంచుతున్నారు. నాగబాబు చేస్తున్న వ్యాఖ్యలు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. నాగబాబు ప్రస్తుతం అటు బుల్లి తెరపై, సినిమాల్లో రాణిస్తున్నారు. తన సోదరుడు పవన్ కళ్యాణ్ కు మద్దత్తు తెలుపుతూ సోషల్ మీడియాలో నాగబాబు సరికొత్త ప్రచారం మొదలుపెట్టారు. వరుణ్ తేజ్ పై వస్తున్న కొన్ని పుకార్లపై నాగబాబు ఓ ఇంటర్వ్యూలో మండిపడ్డారు.

ఆ ఆలోచన లేదు

ఆ ఆలోచన లేదు

నాగబాబు జనసేన పార్టీకి మద్దత్తు తెలుపుతున్నా.. ఆ పార్టీలో చేరలేదు. దీనికి గల కారణాన్ని నాగబాబు వివరించారు. బంధుప్రీతి నా తమ్ముడిపై రుద్దాలనే ఉద్దేశం నాకు లేదు. పార్టీలో ఉన్నా లేకున్నా పవన్ కోసం ప్రచారం చేస్తానని నాగబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ కులాలకు, మతాలకు, బంధుప్రీతికి దూరంగా రాజకీయం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గెలుపునకు తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నాగబాబు అన్నారు.

డొనేషన్ ఇచ్చాం

డొనేషన్ ఇచ్చాం

ఇటీవల తాను, తన కుమారుడు కలసి జనసేన పార్టీ కోసం ఇచ్చిన ఫండ్ ని కూడా కొందరు రాజకీయం చేస్తున్నారు అంటూ నాగబాబు మండిపడ్డారు. వరుణ్ తేజ్ జనసేన పార్టీకి డబ్బు ఇచ్చింది పవన్ కళ్యాణ్ అభిమానులు చరణ్ వైపు వెళ్లకుండా తనవైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతోనే అని కొందరు పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. తాము పార్టీ ఫండ్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ పై ఉన్న ప్రేమతో అని నాగబాబు తెలిపారు.

చరణ్, వరుణ్ తేజ్ ఎలా ఉంటారంటే

చరణ్, వరుణ్ తేజ్ ఎలా ఉంటారంటే

రాంచరణ్, వరుణ్ తేజ్ కజిన్ బ్రదర్స్. కానీ వాళ్లిద్దరూ ఒకే తల్లి కడుపున పుట్టిన బిడ్డలా ఉంటారు. మీ కు తెలుసో లేదో.. నేను, అన్నయ్య ఎలా ఉంటామో వాళ్లిద్దరూ ఆలా ఉంటారని నాగబాబు అన్నారు. ఇక నిహారికని రాంచరణ్ తన సొంతచెల్లిగా భావించి చూసుకుంటాడు అని నాగబాబు అన్నారు. అయినా మా అన్న కొడుకుని మేము ఎందుకు దూరం చేసుకుంటాం అని నాగబాబు తెలిపారు. ఇలాంటి పుకార్లు సృష్టించడం వలన ఎవరికీ ఎలాంటి ఉపయోగం లేదని తెలిపారు.

క్రేజీ హీరోగా

క్రేజీ హీరోగా

వరుణ్ తేజ్ ప్రస్తుతం విభిన్న కథలు ఎంచుకుంటూ క్రేజీ హీరోగా దూసుకుపోతున్నాడు. గత ఏడాది అంతరిక్షం లాంటి వైవిధ్యమైన చిత్రంలో నటించిన వరుణ్, ఇటీవల ఎఫ్ 2 చిత్రంతో ఘనవిజయం సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శత్వంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. వరుణ్ తేజ్ కొన్ని రోజుల క్రితం కోటి రూపాయలు జనసేన పార్టీకి డొనేషన్ గా అందించిన సంగతి తెలిసిందే. దీనికి స్వయంగా పవనే సోషల్ మీడియాలో కృతజ్ఞతలు తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X