పవన్ కల్యాణ్, క్రిష్ సినిమా స్టోరీ లీక్ చేసిన నాగబాబు.. టైటిల్ అదేనంటూ ప్రచారం

కరోనావైరస్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన నాగబాబు సోషల్ మీడియాలో లైవ్ ద్వారా అభిమానులతో ముచ్చటిస్తున్నారు. సోషల్ డిస్టెన్స్‌ పాటిస్తూనే అభిమానులు అడిగే ప్రశ్నలకు తన యూట్యూబ్ ఛానెల్‌లో సమాధానాలు ఇస్తున్నారు. తాజాగా ఇన్స్‌టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో అడిగిన ప్రశ్నలకు తన ఛానెల్‌లో జవాబులిచ్చారు. ఈ సందర్భంగా క్రిష్, పవన్ కల్యాణ్ సినిమా గురించి వెల్లడించారు. ఆ విషయాలు ఏమిటంటే..

పవన్ కల్యాణ్ లేటేస్ట్ అప్‌డేట్స్

పవన్ కల్యాణ్ లేటేస్ట్ అప్‌డేట్స్


పవన్ కల్యాణ్ సినిమాలపై లేటేస్ట్ అప్‌డేట్ ఏమిటని ఓ అభిమాని ప్రశ్నించగా.. నా తమ్ముడు సినిమాలకు సంబంధించి లేటేస్ట్ అప్‌డేట్స్ నాకు పెద్దగా తెలియవు. నా కంటే మీకే సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా ముందుగా మీకే తెలుస్తాయి. పవన్ సినిమాలకు సంబంధించిన లేటేస్ట్ అంశాల గురించి నేను పెద్దగా ఆసక్తి చూపను అని నాగబాబు అన్నారు.

తమిళ, హిందీ కంటే వకీల్ సాబ్ గొప్పగా

తమిళ, హిందీ కంటే వకీల్ సాబ్ గొప్పగా


చాలా రోజుల తర్వాత పవన్ కల్యాణ్ పింక్ రీమేక్‌గా రూపొందుతున్న వకీల్ సాబ్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా హిందీలో పింక్‌గా వచ్చింది. అందులో అమితాబ్ పోషించిన పాత్రను, అలాగే తమిళ రీమేక్‌లో అజిత్ నటించిన పాత్రను తెలుగులో పవన్ కల్యాణ్ పోషిస్తున్నారు. ఆ రెండు పాత్రల కంటే 15 శాతం కథలో మార్పులు ఉంటాయి. మంచి సినిమా అవుతుంది అని పవన్ చెప్పారు అని నాగబాబు తెలిపారు.

క్రిష్ సినిమాలో తెలుగు యోధుడిగా

క్రిష్ సినిమాలో తెలుగు యోధుడిగా

ఇక వకీల్ సాబ్ తర్వాత క్రిష్ జాగర్లమూడితో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఆ చిత్ర కథ మొగల్ సామ్రాజ్యం నేనథ్యంగా సాగుతుంది. ఆ సమయంలో తెలుగు ప్రాంతంలో ఉండే ఓ యోధుడి పాత్రను పవన్ కల్యాణ్ పోషిస్తున్నట్టు నాకు తెలిసింది. అంతేకాకుండా కోహినూర్ వజ్రం నేపథ్యంగా సినిమా సాగుతుందనే వార్తలు నాకు వినిపించాయి. ఇంకా ఆ సినిమా గురించి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని నాగబాబు చెప్పారు.

300 కోట్లతో క్రిష్ సినిమా

300 కోట్లతో క్రిష్ సినిమా

పవన్ కల్యాణ్, క్రిష్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు విరూపాక్ష అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు ప్రముఖ రచయిత బుర్ర సాయిమాధవ్ అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Recommended Video

Mega Brother Nagababu Comments on Pawan Kalyan's Upcoming Films
నాగబాబు అదిరింది అంటూ..

నాగబాబు అదిరింది అంటూ..

ఇక నాగబాబు సినిమాలతోపాటు టెలివిజన్ రంగంలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. కొన్ని రోజుల వరకు జబర్దస్త్ కామెడీ షోలో రోజాతో కలిసి హోస్ట్‌గా వ్యవహరించారు. కొన్ని కారణాల జబర్దస్త్ నుంచి తప్పుకొని ఇప్పుడు అదిరింది అనే కామెడీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X