బాలకృష్ణపై నాగబాబు వివాదాస్పద ట్వీట్.. తీవ్రస్థాయిలో మళ్లీ సెటైర్లు
60వ బర్త్ డే జరుపుకొంటున్న నందమూరి బాలకృష్ణపై మరోసారి నాగబాబు సైటర్లు గుప్పించారు. బాలకృష్ణ పాటపాడటాన్ని టార్గెట్‌గా చేసుకొన్న మెగా బ్రదర్ పరోక్షంగా చురకలు అంటించారు. తన బర్త్ డే సందర్భంగా ప్రముఖ గాయకుడు ఘంటసాల పాడిన పాటను బాలకృష్ణ రీమిక్స్ చేయడం మీడియాలో చర్చనీయాంశమైంది. బాలకృష్ణ పాడిన పాటపై ఆర్జీవి సహా, మరొకొందరు సెటైర్ల వేయగా వారితో నాగబాబు జతకలిశాడు. ఇంతకు నాగబాబు పరోక్షంగా ఏమన్నారంటే..

మెగా, నందమూరి ఫ్యామిలీ మధ్య
గత కొద్దిరోజులుగా మెగా, నందమూరి ఫ్యామిలీ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి కనిపిస్తున్నది. తెలుగు రాష్ట్రాల సీఎంలతో భేటీ నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. భూములు పంచుకోవడానికే సీఎంలతో, తెలుగు రాష్ట్రాలత ప్రభుత్వాలతో సినీ ప్రముఖుల బృందం భేటీ అవుతున్నదని బాలకృష్ణ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

బాలకృష్ణ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు
నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. భూములు పంచుకొన్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పు. టీడీపీ వాళ్ళు భూముల దందా చేశారు. ఇలా సీఎంలు, ప్రభుత్వాలపై అగౌరవంగా వ్యాఖ్యలు చేసినందుకు బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని నాగబాబు డిమాండ్ చేయడం మరింత వివాదాస్పదంగా మారింది.

సినీ పరిశ్రమ గ్రూపులుగా
ఇలా మెగా, నందమూరి ఫ్యామిలీ మధ్య చోటుచేసుకొంటున్న వివాదం కారణంగా సినీ పరిశ్రమ రెండుగా చీలిపోయిందనే వాదన మొదలైంది. రెండు గ్రూపులుగా సినీ పరిశ్రమ విడిపోయిందనే వార్తలు వచ్చాయి. అయితే వాటిపై పెద్దగా స్పందించకుండా సినీ ప్రముఖులు ఆ వివాద తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు.

తాజాగా బాలకృష్ణ పాటపై
ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ నాగబాబు పరోక్షంగా బాలకృష్ణపై వ్యాఖ్యలు చేశారు. ఇక ఎవరేమనుకొన్నా పట్టించుకొని మనస్తత్వం బాలకృష్ణది. గతంలో కూడా వేదికలపై పాటలు పాడుతూ అందర్నీ నవ్విస్తూ ఆకట్టుకొన్నారు. తాజాగా తన అభిమానులకు పుట్టిన రోజు గిఫ్టుగా శివశంకరీ.. శివానందలహరి శివ శంకరీ అంటూ బాలకృష్ణ పాటను పాడి రిలీజ్ చేశారు. అయితే బాలకృష్ణ పాడిన పాట అంతగా ఆకట్టుకోగా పోగా పలువురి విమర్శలకు కారణమైంది.

నాగబాబు సెటైర్లు వేస్తూ ట్వీటు
ఈ క్రమంలో నాగబాబు ట్విట్టర్‌లో చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఒక్కోసారి ఓల్డ్ సాంగ్స్ రీమిక్స్ కన్నా originals చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ తరానికి ఘంటసాల గాత్ర మాధుర్యం విలువ ఈ పాటికే తెలిసుంటది అని బాలకృష్ణ పాడిన శివశంకరీ పాటను ఉద్దేశించి కామెంట్ చేశారు. అలాగే చంద్రబాబు, టీడీపీ పార్టీ నాయకులపై కూడా వరుస ట్వీట్లతో ఘాటైన విమర్శలు చేశారు.
Recommended Video

పచ్చ మీడియాపై నాగబాబు
ఇక పచ్చ మీడియాలో వస్తున్న వార్తలపై కూడా నాగబాబు ట్వీట్స్‌తో సెటైర్లు వేశారు. పత్రికల స్పిరిట్ అంటే శభాస్. ఒక్కోసారి జగన్మోహన్ రెడ్డి గారే వీళ్లకి కరెక్ట్ అని డౌట్ వస్తుందేమిటి అంటూ తనదైన శైలిలో నాగబాబు చమత్కరించారు. ఇలా బాలకృష్ణ, చంద్రబాబుపై నాగబాబు ట్వీట్లు చేస్తూ సెటైర్లు వేయడంతో మళ్లీ వివాదం రాజుకొంటుందా? అనే ప్రశ్నలు లేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











