twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదంతా నా వ్యక్తిగతం.. ఎవ్వరితోనూ సంబంధం లేదు.. మరో వివరణ ఇచ్చిన నాగబాబు

    |

    మెగా బ్రదర్ నాగబాబు నాథురాం గాడ్సేపై చేసిన ట్వీట్ చినికి చినికి గాలి వానగా మారేట్టు కనిపిస్తోంది. గాడ్సే పుట్టిన రోజు సందర్భంగా నాగబాబు చేసిన ఈ ట్వీట్‌లో ఆయన్ను ఓ దేశ భక్తుడిగా కీర్తించడం అభ్యంతరకంగా మారింది. ఇక ఈ ట్వీట్‌పై రాజకీయ నాయకులు భగ్గుమన్నారు. పలువురు నాగబాబుపై ఫైర్ కాగా కొంతమంది.. కేసులు కూడా పెట్టారు. అయితే నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ, చిరంజీవికి ఆపాదించి విమర్శిస్తున్నారు. అలాంటి కామెంట్లపై స్పందిస్తూ.. నాగబాబు వివరణ ఇచ్చాడు. అసలింతకీ నాగబాబు చేసిన ట్వీట్స్ ఏంటి? ఎందుకు ఈ గొడవ జరుగుతోందో ఓ సారి చూద్దాం.

     కాంట్రవర్సీకి తెరదీసిన ట్వీట్..

    కాంట్రవర్సీకి తెరదీసిన ట్వీట్..

    నాగబాబు చేసిన ట్వీట్ల సారాంశం.. ‘ఈ రోజు నాథూరాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశ భక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కాదా? అనేది చర్చనీయాంశం. కానీ, అతని వైపు వాదనను ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే)' అని చెప్పారు.

    ఆయన దేశభక్తిని శంకించలేం...

    ఆయన దేశభక్తిని శంకించలేం...

    'గాంధీని చంపితే ఆపఖ్యాతి పాలవుతానని తెలిసినా తను అనుకున్నది చేశాడు. కానీ, నాథూరాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తు చేసుకోవాలనిపించింది. పాపం నాథూరాం గాడ్సే. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్'అని పేర్కొన్నాడు.

    నాగబాబు వివరణ...

    నాగబాబు వివరణ...

    ఈ ట్వీట్లపై తీవ్ర వ్యతిరేకత రావడంతో నాగబాబు వివరణ ఇచ్చుకున్నాడు. ‘దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోండి. నేను నాధురాం గురించి ఇచ్చిన ట్వీట్‌లో నాధురాం చేసిన నేరాన్ని సమర్ధించలేదు. నాధురాం వెర్షన్ కూడా జనానికి తెలియాలని మాత్రమే అన్నాను. నాకు మహాత్మగాంధీ అంటే నాకు చాలా గౌరవం. వాస్తవానికి నన్ను విమర్శించే వల్లకన్నా నాకు ఆయనంటే చాలా గౌరవమ'ని చెప్పుకొచ్చాడు.

    Recommended Video

    Nathuram Godse Has Patriotism, Media Didn't Project His View That Time: Nagababu
     మెగా బ్రదర్ మరో వివరణ..

    మెగా బ్రదర్ మరో వివరణ..

    గాడ్సేపై నాగబాబు చేసిన ట్వీట్‌పై వ్యక్తిగత దూషణలు, కుటుంబం వరకు వెళ్లడంతో నాగబాబు మరో వివరణ ఇచ్చుకున్నాడు. ‘నేను ఏమి ట్వీట్ చేసినా, అందులో ఏమున్నా, అది నా వ్యక్తిగత బాధ్యతే. జనసేన పార్టీకిగానీ, మా కుటుంబంలోని మరెవరికైనాగానీ నా అభిప్రాయాలతో ఎటువంటి ప్రమేయమూ లేద'ని చెప్పుకొచ్చాడు.

    English summary
    Nagababu Says That Comments on Nathuram Godse Is His Personnel Only. He Says That Whatever i tweet on anything,it's my personal responsibility.janasena party or any of my family has no involvement in my opinion
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X