చిరంజీవి బయోపిక్‌పై నాగబాబు వ్యాఖ్యలు.. రాంచరణ్‌కి కూడా ఆ ఆలోచన వద్దు!

చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం బయోపిక్ చిత్రాల ట్రెండ్ సాగుతోంది. కొన్ని బియోపిక్స్ విజయం సాధిస్తున్నాయి.. మరికొన్ని చతికిలబడుతున్నాయి. సావిత్రి, ఎన్టీఆర్, జయలలిత, వైఎస్ఆర్ లాంటి ప్రముఖులపై ఇప్పటికే బయోపిక్ చిత్రాలు వచ్చాయి. దీనితో మరికొందరి ప్రముఖుల బియోపిక్స్ కోసం కసరత్తు జరుగుతోంది. మెగా బ్రదర్ నాగబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిరంజీవి బయోపిక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చిరంజీవి బయోపిక్

చిరంజీవి బయోపిక్

మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ తెరకెక్కించే ఆలోచన ఉందా అని ఓ ఇంటర్వ్యూలో నాగబాబుకు ప్రశ్న ఎదురైంది. చిరంజీవి చాలా చిన్న స్థాయి నుంచి టాలీవుడ్ లో నెం 1 హీరోగా ఎదిగారు. అలాంటి వ్యక్తి జీవిత చరిత్ర వెండితెరపై వస్తే ఆసక్తికరంగా ఉంటుందనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేశారు. కానీ నాగబాబు మాత్రం చిరంజీవి బయోపిక్ తెరకెక్కించే ఆలోచన లేదని అన్నారు. అందుకు గల కారణాన్ని కూడా వివరించారు.

 అందుకే విజయం సాధించాయి

అందుకే విజయం సాధించాయి

సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహాననటి, సిల్క్ స్మిత బయోపిక్ డర్టీ పిక్చర్, సంజయ్ దత్ బయోపిక్ సంజు విజయవంతం కావడానికి కారణం ఉంది. వీరందరు జీవితంలో ఎదో ఒక సందర్భంలో తీవ్రమైన ఒడిదుడుకులు దుర్కొన్నవారే. అలాంటి కథలు ఆడియన్స్ కి ఆసక్తిగా ఉంటాయి. సావిత్రి జీవితంలో వివాహం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఆసక్తికరం. సిల్క్ స్మిత సావిత్రి అంత గొప్ప నటికాదు. కానీ ఒక ఆడపిల్లగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి అనేక ఇబ్బందులు ఎదుర్కొంది అని నాగబాబు అన్నారు.

 సినిమా అలాగే ఉండాలి

సినిమా అలాగే ఉండాలి

ఇక సంజు బయోపిక్ కూడా మంచి విజయం సాధించింది. సంజయ్ దత్ కోర్టులు, కేసులతో ఇలా ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారో అందరికి తెలుసు. కెరీర్ లో విజయం సాధించిన ప్రతి ఒక్కరి జీవితాలని బియోపిక్స్ గా తీయలేం. సినిమా అంటే కష్టాలు, కన్నీళ్లు, సంతోషం అన్ని కలగలిపి ఉండాలి. చిరంజీవి గారి విషయానికి వస్తే.. అన్నయ్య ఆరంభంలో తప్ప పెద్దగా ఇబ్బంది పడిన సందర్భాలు లేవు. అన్నయ్య కెరీర్ సక్సెస్ ఫుల్ జర్నీ అని జగబాబు అన్నారు.

ఆ ఆలోచన వద్దు

ఆ ఆలోచన వద్దు

చిరంజీవి బయోపిక్ తీయాలనే ఆలోచన నాకు లేదు. రాంచరణ్ కు కూడా ఆ ఆలోచన వద్దు అని నాగబాబు అన్నారు. అన్నయ్య జీవితం అందరికి ఆదర్శం. కానీ బయోపిక్ చిత్రానికి సెట్ అవుతుందని నేను అనుకోవడం లేదు అని నాగబాబు అన్నారు. సావిత్రి, సంజు లాంటి చిత్రాలని నిజాలు తెలుసుకునేందుకు ప్రేక్షకులు చూశారని నాగబాబు అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X