అందుకే హిందుత్వం అంటే గౌరవం.. మరోసారి మతాలపై నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్
మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో చేసే కామెంట్లు ఒక్కోసారి ఎంతటి వివాదానికి దారి తీస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కరోనా, లాక్ డౌన్ కాలంలో నాగబాబు సృష్టించిన రచ్చ ముందు ఏది పనికిరాదు. అటు కరోనాకు, దేవుడితో లింకు పెట్టినా, కరెన్సీ నోట్లపై స్పందించినా, గాంధీ, గాడ్సేలపై ట్వీట్స్ చేసినా, బాలయ్య గొంతుపై, శివ శంకరీ పాటపై స్పందించినా అంతా నాగబాబుకే చెల్లింది. నాగబాబు ఎప్పుడు ఎందుకు ఎలా స్పందిస్తాడో ఎవ్వరూ చెప్పలేరు. తాజాగా మరోసారి మతాలు, హిందుత్వం గురించి ఓ ట్వీట్ చేశాడు.

సోషల్ మీడియాలో కాంట్రవర్సీ..
నాగబాబును మరో రకం వర్మ అని కొందరు కామెంట్స్ చేస్తుంటారు. నాగబాబు కూడా ఎప్పుడు ఎలా ఉంటాడో చెప్పడం కష్టం. సాధారణంగా నాగబాబు చేసే ప్రతీ వ్యాఖ్యలు ఏదో ఒక వివాదాన్ని రేకెత్తిస్తూనే ఉంటాయి. ఓ వైపు యూట్యూబ్‌లో వీడియోలతో రెచ్చిపోతూనే.. ట్విట్టర్‌లోనూ దంచి కొడుతుంటాడు. తాజాగా నాగబాబు మతాలపై స్పందించాడు.

నేనొక నాస్తికుడిని..
హిందుత్వం గురించి నాగబాబు చెబుతూ.. ‘నేనొక నాస్తికుడిని.కానీ కొన్ని మత సిద్ధాంతాల పట్ల నా ఒపీనియన్ చెప్పాలి. నాకు హిందుత్వం అంటే గౌరవం. కారణం ఏంటంటే ఈశ్వరుడు ఒక్కడే అని నమ్మినా,అనేక దేవతలున్నారని నమ్మినా,విగ్రహారాధనని నమ్మినా,ఇతర మతాలని నమ్మినా,అసలు దేవుడే లేడనే నాస్తికులుని ఎవరినీ నిందించని మతం హిందూమతం.

అందుకే గౌరవం..
మనిషిని మనిషిగా మంచిగా బ్రతకమని చెప్తుంది హిందుమతం.ఇతర మతాలతో సఖ్యంగా ఉండమని చెప్తుంది హైన్దవం.నీ మతం కానీ వాడిని చంపెయ్యి,విగ్రహారాధన చేసే వాళ్ళు నరకానికి పోతారు,మా దేవుడు నిజమైన దేవుడు మీ దేవుడు చెడ్డవాడు లాంటి పిచ్చి మాటలు చెప్పని హిందుత్వం అంటే నాకు గౌరవం' అని చెప్పుకొచ్చాడు.
Recommended Video

రెండు షోలతో బిజీగా..
కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా రెండు కొత్త ప్రోగ్రాంలను ప్రారంభించబోతోన్నాడు. ఖుషీ ఖుషీగా, విజిల్ ప్రీ లోడెడ్ అంటూ రెండు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలను ప్లాన్ చేశాడు. దీని కోసం ప్రతిభ ఉన్న వారంతా దరఖాస్తులు చేసుకోవాలని కోరిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











