RRR రివ్యూపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు: ఏసుకోవడం అంటే అది కాదు.. న్యూసెన్స్ సైట్ అంటూ!

చాలా కాలంగా కళ్లలో ఒత్తులు పెట్టుకుని మరీ ఎదురు చూసిన సినీ ప్రియుల నమ్మకాన్ని నిలబెడుతూ.. విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకోవడంతో పాటు.. సినీ చరిత్రలోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పది వేలకు పైగా థియేటర్లలో ప్రదర్శితం అయిన ఈ సినిమాకు అదిరిపోయే స్పందన దక్కింది. దీనికితోడు పాజిటివ్ టాక్.. మంచి రివ్యూలు కూడా వచ్చాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఓ వెబ్‌సైట్ RRR మూవీకి ఇచ్చిన రివ్యూపై మెగా బ్రదర్ నాగబాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేసి మరీ విమర్శలు చేశారు. అసలేం జరిగిందో చూద్దాం పదండి!

 దర్శకధీరుడితో స్టార్ హీరోలు

దర్శకధీరుడితో స్టార్ హీరోలు

టాప్ డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి రూపకల్పనలో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేసిన భారీ చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). డీవీవీ దానయ్య నిర్మించిన ఈ మూవీకి కీరవాణి సంగీతం అందించారు. ఈ మూవీలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. ఇందులో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రలు పోషించారు.

12 భాషల్లో 20 దేశాలకు పైగా

12 భాషల్లో 20 దేశాలకు పైగా

ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన RRR మూవీపై ఆరంభం నుంచే ఓ రేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే అప్‌డేట్ల వల్ల ఇది ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 12 భాషల్లో, 20 దేశాల్లో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.

ఇండియాలో భారీ బిజినెస్

ఇండియాలో భారీ బిజినెస్

ఇండియాలోనే బిగ్ మల్టీస్టారర్‌గా రూపొందిన RRR మూవీపై ఎన్నో అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 190 కోట్లు బిజినెస్ చేసుకుంది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ రేటు పలికింది. ఇలా అన్ని ఏరియాలు కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్ల వ్యాపారం జరిగింది.

అంతా పాజిటివ్... దడదడ

అంతా పాజిటివ్... దడదడ

మెగా, నందమూరి హీరోల కాంబోలో వచ్చిన RRR (రౌద్రం రణం రుధిరం) శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏరియాల నుంచి దీనికి పాజిటివ్ టాక్ వచ్చింది. అదే సమయంలో థియేటర్లన్నీ ప్రేక్షకుల రాకతో కళకళలాడిపోయాయి. దీంతో అన్ని చోట్లా పండుగ వాతావరణం నెలకొంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు దడదడలాడాయి.

జనాలే కాదు.. ప్రముఖులూ

జనాలే కాదు.. ప్రముఖులూ

RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ కోసం చాలా కాలంగా అభిమానులు వేయి కళ్లతో వేచి చూశారు. ఇక, వాళ్ల నిరీక్షణను నిన్నటితో తెరపడింది. దీంతో అందరూ థియేటర్ల వైపు పరుగులు పెడుతున్నారు. అదే సమయంలో సెలెబ్రిటీలు కూడా ఈ సినిమాను చూస్తున్నారు. అంతేకాదు, ట్విట్టర్ వేదికగా పోస్టులు కూడా చేస్తున్నారు. దీంతో సినిమా పేరు మారుమ్రోగుతూనే ఉంది.

ఆ రివ్యూపై నాగబాబు ఫైర్

ఆ రివ్యూపై నాగబాబు ఫైర్

ఓ ఫేమస్ వెబ్‌సైట్ RRR మూవీకి ఇచ్చిన రివ్యూ ఇచ్చింది. ఇందులో సదరు సైట్ ఈ సినిమాలో రొమాన్స్ లేకపోవడం నెగెటివ్ పాయింట్ అంటూ పేర్కొంది. దీనిపై మీమ్స్ వచ్చాయి. అందులో ‘ఏసుకోవడం అంటే ఆ ఏసుకోవడం అనుకున్నావా' అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. తాజాగా దీన్ని మెగా బ్రదర్ నాగబాబు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసి దీనిపై స్పందించారు.

Recommended Video

RRR Review: NTR, Ram Charan కెరీర్‌లో ది బెస్ట్ SS Rajamouli అంకితభావం | Filmibeat Telugu
న్యూసెన్స్ సైట్ అని పోస్ట్

న్యూసెన్స్ సైట్ అని పోస్ట్

ఆ వెబ్‌సైట్‌పై వచ్చిన మీమ్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన నాగబాబు.. ‘అది న్యూస్ వెబ్‌సైట్ కాదు.. న్యూసెన్స్ సైట్' అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. దీంతో దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో నాగబాబు.. సంచలన విజయం సాధించిన RRR మూవీ టీమ్‌కు కూడా మరో పోస్టులో కంగ్రాట్స్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X