వాళ్లకు ఫస్ట్ నైట్ గురించి ముందే తెలుసు.. ఇప్పుడన్నీ వాటిలోనే దరిద్రంగా: నాగబాబు సంచలన వ్యాఖ్యలు

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ప్రవేశించి.. హీరోగా, సహాయ నటుడిగా, నిర్మాతగా ఇలా ఎన్నో రకాలుగా అలరించారు మెగా బ్రదర్ నాగబాబు. బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ తనలోని టాలెంట్లను బయటకు తీసి గొప్ప యాక్టర్ అనిపించుకున్నారు. అదే సమయంలో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సత్తా చాటారు. ఈ క్రమంలోనే ఎన్నో షోలకు జడ్జ్‌మెంట్ చేసి మెప్పించారు. ఇక, కొత్త టాలెంట్లను బయటకు తీసుకొచ్చేందుకు ఎన్నో వినూత్నమైన షోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ షోలో నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు మీకోసం!

జబర్ధస్త్‌గా ఎంట్రీ ఇచ్చిన మెగా బ్రదర్

జబర్ధస్త్‌గా ఎంట్రీ ఇచ్చిన మెగా బ్రదర్

సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన నాగబాబు.. ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయిన జబర్ధస్త్‌ షో ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. దాదాపు ఏడేళ్లు పాటు దానికి జడ్జ్‌గా పని చేశారు. ఈ క్రమంలోనే తనదైన శైలి మేనరిజంతో ప్రేక్షకులను అలరించారు. తద్వారా స్మైలింగ్ స్టార్, టవర్ స్టార్ అనే పేర్లు సంపాదించుకున్నారు. అంతేకాదు, తెలుగు ప్రేక్షకుల మనసులు కూడా దోచుకున్నారు.

అదిరిపోయేలా ప్రారంభమై మధ్యలోనే

అదిరిపోయేలా ప్రారంభమై మధ్యలోనే

చాలా ఏళ్ల పాటు జబర్ధస్త్ షోకు జడ్జ్‌గా వ్యవహరించిన మెగా బ్రదర్ నాగబాబు.. కొద్ది రోజుల క్రితం ఆ షోకు గుడ్‌బై చెప్పేశారు. అదే సమయంలో మరో ఛానెల్‌లో 'అదిరింది' అనే షోను ప్రారంభించారు. జబర్ధస్త్‌ షోకు దర్శకత్వం వహించిన నితిన్, భరత్ దీనిని రూపొందించారు. అదిరింది, బొమ్మ అదిరింది అంటూ రెండు సీజన్ల పాటు సాగిన ఈ షో ప్రస్తుతానికి ప్రసారం అవడం లేదు.

వాళ్లను ఎంకరేజ్ చేసేందుకు కొత్త షో

వాళ్లను ఎంకరేజ్ చేసేందుకు కొత్త షో

జబర్ధస్త్ షోలో పని చేసినప్పుడే ఎంతో మంది ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు నాగబాబు. అదిరిందిలోనూ అదే కంటిన్యూ చేస్తున్నారు. ఇలా కాకుండా స్వతహాగా కొందరిలోని టాలెంట్‌ను గుర్తించి వాళ్లను వెలుగులోకి తీసుకు రావాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే సొంతంగా కొన్ని షోలను ప్రారంభించబోతున్నట్లు ఆ మధ్య యూట్యూబ్ చానెల్ ద్వారా తెలిపారు.

తొలి స్టాండప్ కామెడీ.. ఖుషీ ఖుషీగా

తొలి స్టాండప్ కామెడీ.. ఖుషీ ఖుషీగా

కామెడీని పంచగలిగే సామర్థ్యం ఉన్న వాళ్లకు అవకాశం కల్పించడం కోసం నాగబాబు 'ఖుషీ ఖుషీగా' అనే స్టాండప్ కామెడీ షోను మొదలు పెట్టారు. తన సొంత యూట్యూబ్ చానెల్ 'నా చానెల్.. నా ఇష్టం'లో ప్రసారం ఈ షో ప్రసారం అవుతుంది. దాదాపు ముప్పై మంది నుంచి కొందరిని సెలెక్ట్ చేసి దీన్ని ప్రారంభించారు. ఇప్పటికే ఈ షో పది ఎపిసోడ్లను కూడా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసింది.

బూతులు.. వల్గారిటీ.. నాగబాబు ఇలా

బూతులు.. వల్గారిటీ.. నాగబాబు ఇలా

'ఖుషీ ఖుషీగా' షోలో బూతులు ఉన్నాయని, చాలా మంది కంటెస్టెంట్లు వల్గర్‌గా మాట్లాడుతున్నారని ఆరంభంలో ఎన్నో విమర్శలు వచ్చాయి. దీనిపై నాగబాబు స్పందిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. అంతేకాదు, తమ షో నచ్చని వాళ్లు అస్సలు చూడొద్దని చెప్పారు. కామెడీ కోసం చెప్పేవి బూతులు అనిపిస్తే అది వాళ్ల కర్మకే వదిలేస్తామని ఘాటుగా వ్యాఖ్యానించారాయన.

సెక్స్ ఎడ్యుకేషన్‌పై నాగబాబు క్లారిటీ

సెక్స్ ఎడ్యుకేషన్‌పై నాగబాబు క్లారిటీ

'ఖుషీ ఖుషీగా' 11వ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో ఓ కంటెస్టెంట్ 'నేను ఈరోజు చెప్పే టాపిక్ వివాదాస్పద.. ఆసక్తికరమైనది' అంటూ తన ప్రదర్శనను ప్రారంభించాడు. దానికి నాగబాబు 'ఎవడు చెప్పాడయ్యా అది కాంట్రవర్శీ అని. బాగా అవసరమైన, ఆసక్తికరమైన టాపిక్' అని బదులిచ్చాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా పక్కున నవ్వేశారు.

ఇప్పుడన్నీ వాటిలోనే దరిద్రంగా అంటూ

ఇప్పుడన్నీ వాటిలోనే దరిద్రంగా అంటూ

ఇప్పటి ఫస్ట్ నైట్‌ల గురించి మాట్లాడుతూ.. 'ఇప్పటి పరిస్థితుల్లో ఫస్ట్ నైట్స్‌ అన్నీ హోటల్స్‌లో జరుగుతున్నాయి. ఇది వరకైతే శోభనం గదిలో ఏం జరిగిందో అని చూడ్డానికి ఓ భూతద్దం పట్టుకుని వచ్చేసేవాళ్లు. ఇవాళ పిల్లలకు అన్నీ తెలిసిపోతున్నాయి. తెలియాల్సిన దాని కంటే ఎక్కువ తెలుస్తున్నాయి. అవసరానికి మించి తెలవడమే దరిద్రం' అంటూ చెప్పుకొచ్చారు నాగబాబు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X