చెప్పుతో దవడ పగలగొట్టండి.. క్యాస్టింగ్ కౌచ్‌పై నాగబాబు
టాలీవుడ్‌ను ప్రస్తుతం క్యాస్టింగ్ కౌచ్ అంశం కుదిపేస్తున్నది. నెలరోజులుగా సినీ పరిశ్రమపై అనేక విమర్శలు, ఆరోపణల వెల్లువ ఎక్కువైంది. శ్రీరెడ్డి, మాధవీలత, సునీత బోయ లాంటి యాక్టర్లు కొందరిని టార్గెట్‌గా చేసుకొని స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ తరఫున స్పందించారు.
క్యాస్టింగ్ కౌచ్ అనేది అన్ని రంగాల్లో ఉంది. కేవలం సినిమా రంగానికి పరిమితం కాలేదు. టెలివిజన్ ఇండస్ట్రీలో ఉంది. కానీ అక్కడ తక్కువగా ఉండవచ్చు. అయితే క్యాష్ కమిటీ వంద వచ్చినా ఈ సమస్య పరిష్కారం కాదు. ఆడవాళ్లలో ధైర్యం రాకపోతే మీకు న్యాయం జరుగదు. ఎవడైనా తప్పుగా మాట్లాడితే లాగి చెప్పుతో దవడ పగలకొట్టండి.

తెలుగు వాళ్లకే అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ నటిస్తున్న వారు తెలుగు వాళ్లు కాదా? అమెరికా నుంచి వచ్చారా? కొందరు హీరోయిన్లు, విలన్లు పరభాష నుంచి పెట్టుకొంటున్నారు. ఆ విషయం నిర్మాత ఇష్టం మేరకే ఉంటుంది. ఎందుకంటే నిర్మాతలు కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీస్తారు. వారి సినిమాలో ఎవరినీ పెట్టుకోవాలో.. పెట్టుకోవద్దో అది వారి ఇష్టం. ఎందుకంటే నిర్మాతలకు నష్టం వస్తే ఎవరు ఇస్తారు.


Click it and Unblock the Notifications