ఎన్టీఆర్‌పై నాగబాబు ఊహించని కామెంట్: ఏకంగా ఆ ఫొటో పోస్ట్ చేసి.. మెగా బ్రదర్ నోటి వెంట అలాంటి మాట!

పేరుకు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడే అయినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు మెగా బ్రదర్ నాగబాబు. సుదీర్ఘమైన ప్రయాణంలో హీరోగా, నిర్మాతగా, సహాయ నటుడిగా ఎన్నో విధాలుగా మెప్పించిన ఆయన.. దాదాపు మూడు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ముందుకెళ్తున్నారు. రాజకీయాల్లోనూ కాలేసిన ఈ టాల్ స్టార్.. సమాజంలో జరిగే అన్ని విషయాలపై స్పందిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే నాగబాబు... టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌పై నాగబాబు షాకింగ్ కామెంట్ చేశారు. ఆ వివరాలు మీకోసం!

రాక్షసుడితో ఎంట్రీ.. హీరోగా నిర్మాతగా

రాక్షసుడితో ఎంట్రీ.. హీరోగా నిర్మాతగా

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'రాక్షసుడు' అనే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు నాగబాబు. ఆ తర్వాత నుంచి వరుసగా ఎన్నో చిత్రాల్లో నటించారు. హీరోగా కొన్ని సినిమాల్లో చేసినా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయారు. అప్పటి నుంచి ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత నిర్మాతగానూ మారి పదుల సంఖ్యలో చిత్రాలను నిర్మించారు.

బికినీ బేబీగా అప్సర రాణి.. స్విమ్మింగ్ పూల్‌లో అలాంటి అవతారంతో

జబర్ధస్త్‌గా ఎంట్రీ.. సుదీర్ఘ ప్రయాణంలో

జబర్ధస్త్‌గా ఎంట్రీ.. సుదీర్ఘ ప్రయాణంలో

సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన నాగబాబు.. ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయిన జబర్ధస్త్‌ షో ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. దాదాపు ఏడేళ్లు పాటు దానికి జడ్జ్‌గా పని చేశారు. ఈ క్రమంలోనే తనదైన శైలి మేనరిజంతో ప్రేక్షకులను అలరించారు. తద్వారా స్మైలింగ్ స్టార్, టవర్ స్టార్ అనే పేర్లు సంపాదించుకున్నారు. అంతేకాదు, తెలుగు ప్రేక్షకుల మనసులు కూడా దోచుకున్నారు.

కామెడీ షోకు గుడ్‌బై.. అదిరింది కూడా

కామెడీ షోకు గుడ్‌బై.. అదిరింది కూడా

చాలా ఏళ్ల పాటు జబర్ధస్త్ షోకు జడ్జ్‌గా వ్యవహరించిన మెగా బ్రదర్ నాగబాబు.. కొద్ది రోజుల క్రితం ఆ షోకు గుడ్‌బై చెప్పేశారు. అదే సమయంలో మరో ఛానెల్‌లో 'అదిరింది' అనే షోను ప్రారంభించారు. జబర్ధస్త్‌ షోకు దర్శకత్వం వహించిన నితిన్, భరత్ దీనిని రూపొందించారు. అదిరింది, బొమ్మ అదిరింది అంటూ రెండు సీజన్ల పాటు సాగిన ఈ షో ప్రస్తుతానికి ప్రసారం అవడం లేదు.

సొంతంగా మరో షో.. తొలిసారి అలాంటి

సొంతంగా మరో షో.. తొలిసారి అలాంటి

జబర్ధస్త్ షోలో పని చేసినప్పుడే ఎంతో మంది ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు నాగబాబు. అదిరిందిలోనూ అదే కంటిన్యూ చేస్తున్నారు. ఇలా కాకుండా స్వతహాగా కొందరిలోని టాలెంట్‌ను గుర్తించి వాళ్లను వెలుగులోకి తీసుకు రావాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే సొంతంగా కొన్ని షోలను ప్రారంభించబోతున్నట్లు ఆ మధ్య యూట్యూబ్ చానెల్ ద్వారా తెలిపారు.

ఎప్పుడూ అందులోనే.. అన్నీ అలానే

ఎప్పుడూ అందులోనే.. అన్నీ అలానే

వరుస సినిమాలు.. షోలు.. ఇతర కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటారు మెగా బ్రదర్ నాగబాబు. ఇందులో భాగంగానే తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విశేషాలను కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటారు. అలాగే, సమాజంలో జరిగే ఎన్నో అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ పోస్టులు పెడుతుంటారు.

ఫ్యాన్స్‌తో లైవ్ చాట్.. ఎన్నో అంశాలు

ఫ్యాన్స్‌తో లైవ్ చాట్.. ఎన్నో అంశాలు

తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫాలోవర్లతో లైవ్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నెటిజన్లు చాలా మంది ఎన్నో రకాల ప్రశ్నలు అడిగారు. వీటన్నింటికీ సామాన్యుడిలానే జవాబులు ఇస్తూ ఆకట్టుకున్నారు మెగా బ్రదర్. అలాగే, రాజకీయాలు, సినిమాలపై తనదైన రీతిలో రిప్లై ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పమంటే ఊహించని కామెంట్ చేశారు.

ఎన్టీఆర్‌పై నాగబాబు ఊహించని కామెంట్

ఎన్టీఆర్‌పై నాగబాబు ఊహించని కామెంట్

ఈ చాట్‌లో ఓ నెటిజన్ 'వీరరాఘవ గురించి చెప్పు నారప్ప రెడ్డి' అని ప్రశ్నించగా.. 'ఇప్పటి తరం నటుల్లో టార్చ్‌ బేరర్' అంటూ అనూహ్యమైన కామెంట్ చేశారు నాగబాబు. వేరే ఫ్యామిలీకి చెందిన హీరోని పొగుడుతూ ఆయన చేసిన వ్యాఖ్యపై ప్రశంసలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. వీళ్లిద్దరూ కలిసి 'అరవింద సమేత.. వీరరాఘవ'లో తండ్రి కొడుకులుగా నటించిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X