For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇండస్ట్రీలో వాళ్లను ఎంతలా హింసించావో చెప్పాలా: ప్రకాశ్ రాజ్ పరువు తీసేసిన నాగబాబు

  |

  నాగబాబు.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగానికి పరిచయం అయిన ఆయన.. నటుడిగా, నిర్మాతగా, సమర్పకుడిగా ఎన్నో రకాల పాత్రలను పోషించారు. ఇక, ఈ మధ్య సినిమాలను తగ్గించిన మెగా బ్రదర్.. పాలిటిక్స్ మీద దృష్టి సారించారు. ఈ క్రమంలోనే తన కుటుంబ సభ్యుల మీద ఎవరైనా విమర్శలు చేస్తే వెంటనే స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌ను ఊసరవెల్లితో పోల్చిన ప్రకాశ్ రాజ్‌పై తాజాగా నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో చేసిన కొన్ని పనులను లీక్ చేసి పరువు తీశారు. వివరాల్లోకి వెళ్తే...

   నా ఛానెల్... నా ఇష్టం అంటూ సెటైర్లు

  నా ఛానెల్... నా ఇష్టం అంటూ సెటైర్లు

  కొద్ది రోజులుగా నాగబాబు సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే యూట్యూబ్‌లో ‘నా ఛానెల్ నా ఇష్టం' అనే ఛానెల్ ప్రారంభించి కొందరు సెలెబ్రిటీలపై సెటైర్లు వేస్తున్నారు. తనను తన ఫ్యామిలీకి సంబంధించిన వారిని విమర్శించే వాళ్లకు ధైర్యంగా సమాధానం చెబుతున్నారు. తద్వారా ఇప్పటికే చాలా వివాదాల్లో చిక్కుకున్నారాయన.

  పవన్‌పై ప్రకాశ్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు

  పవన్‌పై ప్రకాశ్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు

  చాలా కాలంగా పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నారు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై స్పందించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఆయనను ఊసరవెల్లితో పోల్చారు. బీజేపీతో పొత్త పెట్టుకోవడం వల్లే ఇలా స్పందించారు.

   ప్రకాశ్ రాజ్ పరువు తీసిన నాగబాబు

  ప్రకాశ్ రాజ్ పరువు తీసిన నాగబాబు

  తన సోదరుడు పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ ఖాతా ద్వారా సుదీర్ఘమైన ఓ లేఖను షేర్ చేశారు. మిస్టర్ ప్రకాశ్ రాజ్ అంటూ మొదలు పెట్టి.. ఆయన సినీ, రాజకీయ జీవితానికి సంబంధించిన ఎన్నో అంశాలను ప్రస్తావించారు. అంతేకాదు, ఆ లేఖలో కొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు నాగబాబు.

  పనికిమాలిన వాళ్లే విమర్శిస్తున్నారు

  ఈ లేఖలో పవన్ కల్యాణ్‌పై కొందరు చేస్తున్న రాజకీయ విమర్శలను ప్రస్తావిస్తూ ‘రాజకీయాల్లో నిర్ణయాలు మారుతూ ఉంటాయి. కానీ, ఆ నిర్ణయాల వెనుక ప్రజలకు ఉపయోగపడేవి కూడా ఉంటాయి. మా నాయకుడు బీజేపీకి మద్దతివ్వడం వెనుకు ప్రజా ప్రయోజనాలు ఉన్నాయి. ఎవడికి ద్రోహం చేశాడని పవన్‌ను ప్రతి ఒక్కరూ విమర్శిస్తున్నారు' అంటూ ప్రశ్నించారు నాగబాబు.

  డేట్స్ ఇస్తానని వాళ్లను హింసించావు

  డేట్స్ ఇస్తానని వాళ్లను హింసించావు

  సినీ రంగంలో ప్రకాశ్ రాజ్ చాలా మందికి అన్యాయం చేశాడని నాగబాబు ఆరోపించాడు. ‘డబ్బు కోసం నిర్మాతలను ఎంతలా హింసిచావో.. డేట్స్ క్యాన్సిల్ చేసి ఎంతలా ఇబ్బంది పెట్టావో నాకు గుర్తుంది ప్రకాశ్ రాజ్. డైరెక్టర్లను కాకా పట్టి నిర్మాతలను కాల్చుకు తిన్నావు. ముందు నువ్వు మారు. ఆ తర్వాత నిస్వార్ధపరుడైన పవన్ కల్యాణ్‌ను విమర్శించు' అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

  Raj Tarun New Movie Will Be Directed By Santo
  మమ్మల్ని ఆపడం ఎవరి తరం కాదు

  మమ్మల్ని ఆపడం ఎవరి తరం కాదు

  ఎన్నికల గురించి మాట్లాడుతూ.. ‘బీజేపీ, జనసేన కూటమిని ఎవరూ ఆపలేరు. ఏపీకి మా పార్టీ వల్లే మేలు జరుగుతుంది. అలాగే, దేశానికి బీజేపీ వల్ల మంచి జరుగుతుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం. మీడియా అడిగింది కదా అని ఒళ్లు పొంగి నీ పనికిమాలిన రాజకీయ డొల్లతనాన్ని బయట పెట్టుకోకు' అంటూ ప్రకాశ్ రాజ్ పరువు తీసేశారు మెగా బ్రదర్ నాగబాబు.

  English summary
  He acts mainly in supporting roles and villain roles, though he has also played the lead role in some films. He has acted in 143, Anji, Shock, Sri Ramadasu, Chandamama and Orange. He has produced several films with his brothers, Chiranjeevi and Pawan Kalyan under Anjana Productions.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X