Don't Miss!
- Finance
notice peiod: నోటీసు పీరియడ్ కు 'NO' చెప్తే.. ఊ అంటారా.. ఉఊ అంటారా ?
- News
Vastu tips: ఇంట్లో మహిళలకు ఎప్పుడూ రోగాలా? ఈ వాస్తు దోషాలతోనే కావచ్చు!!
- Lifestyle
Today Rasi Palalu 24 January 2023: ఈ రోజు మిథున రాశి వారికి శుభవార్తలు, ఆర్థిక పరిస్థి గొప్ప మెరుగుదల
- Sports
సూర్యకుమార్ యాదవ్.. నా బెస్ట్ ఫ్రెండ్.. అతను నాలాగే ఇబ్బంది పడ్డాడు: సర్ఫరాజ్ ఖాన్
- Automobiles
యాక్టివా కొత్త వేరియంట్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్ - ధర & వివరాలు ఇక్కడ చూడండి
- Technology
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
నాగబాబు సంచలన వ్యాఖ్యలు.. వాడు పెద్ద వెదవ.. అలాంటి కుత్తేగాడు ఇండస్ట్రీలో లేడంటూ!
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతోన్నాయి. ఇప్పటికే అక్కడ అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య వాడీ వేడీ విమర్శలు కనిపిస్తున్నాయి. ఇక, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా ఫుల్ యాక్టివ్ అవడంతో రాజకీయాలు మరింత రంజుగా మారాయి. ఇటీవలే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో జనసేనాని భేటీ అవడంతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ నోళ్లకు పని చెబుతున్నారు. అలాగే, రాంగోపాల్ వర్మ కూడా వాళ్లను విమర్శించాడు. ఈ నేపథ్యంలో తాజాగా మెగా బ్రదర్ నాగబాబు దీనిపై స్పందించారు. వివరాల్లోకి వెళ్తే...

చంద్రబాబును కలిసిన పవన్
గతంలో విశాఖపట్నంలో వైసీపీ ప్రభుత్వం పవన్ కల్యాణ్‌ను ఇబ్బంది పెట్టిన సమయంలో చంద్రబాబు జనసేనానిని పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలే కుప్పంలో చంద్రబాబుకు కూడా అదే పరిస్థితి ఎదురైంది. దీంతో పవన్ కల్యాణ్ ఇటీవలే ఆయనను స్వయంగా కలిశాడు. ఆ సమయంలో రెండు పార్టీలు కలిసి పోరాటం చేస్తాయని ప్రకటించారు.
ఉల్లిపొర లాంటి డ్రెస్ మంచు లక్ష్మి షో: ఓ రేంజ్‌లో ఎద అందాలు ఆరబోత

ప్యాకేజీ కోసమంటూ విమర్శలు
చంద్రబాబు నివాసానికి వెళ్లి పవన్ కల్యాణ్ ఆయనతో భేటీ అవడంపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘాటుగా విమర్శలు చేస్తోన్నారు. ఈ క్రమంలోనే 'చంద్రబాబు దగ్గర ప్యాకేజీ మాట్లాడుకోవడానికి పవన్ కల్యాణ్ కలిశాడు'.. 'చంద్రబాబు దత్త పుత్రుడు పవన్'.. 'చంద్రబాబు దర్శకత్వంలోనే పవన్' అంటూ ఎన్నో రకాలుగా ఘోరంగా కామెంట్లు చేస్తున్నారు.

కాపులను అమ్మేశాడు అంటూ
చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అవడంపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా స్పందించాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో 'కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని, కమ్మోళ్లకు అమ్మేస్తాడని ఊహించనలేదు. RIP కాపులు. కంగ్రాట్స్ కమ్మోళ్లు' అంటూ పోస్ట్ చేశాడు. ఆ తర్వాత కూడా పవన్ కల్యాణ్ గురించి పరోక్షంగా వరుస ట్వీట్లు చేస్తున్నాడు.
షర్ట్ విప్పేసి రెచ్చిపోయిన నిధి అగర్వాల్: ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందా ఏంటీ!

దీనిపై నాగబాబు స్పందిస్తూ
పవన్ కల్యాణ్ - చంద్రబాబు భేటీ గురించి వస్తున్న విమర్శలపై జనసేన పార్టీ నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. తాజాగా ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడిన ఆయన.. అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై.. ఇటు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఎన్నో విషయాలపై ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

కొడాలి నాని గారి స్టైల్‌లోనే
ప్యాకేజీ అంటూ చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. 'ప్యాకేజీ అని చెబుతున్నారు కదా. వాళ్ల అమ్మా మొగుడు వచ్చి ఇచ్చాడా? కొడాలి నాని గారి స్టైల్‌లో చెబుతున్నా. ఒక్క సినిమాకు కోట్ల రూపాయలు తీసుకునే పవన్‌కు ప్యాకేజీతో పనేముంది. ఈ వైసీపీ నాయకులు ఎంత భావదారిద్రంతో చస్తున్నారో దీనిబట్టి మనం అర్థం చేసుకోవచ్చు' అంటూ ఘాటుగానే రిప్లై ఇచ్చారు.
Veera Simha Reddy: వీర సింహా రెడ్డిలో ఆ సీన్‌పై ట్రోల్స్.. ఇంత దారుణమా.. పల్నాటి బ్రహ్మనాయుడు అంటూ!

మీ తాత, మీ బాబు ఇచ్చారా
ఆ తర్వాత నాగబాబు కంటిన్యూ చేస్తూ.. 'ఏరా వైసీపీ నాయకుల్లారా.. మాకు ప్యాకేజీ మీ తాత వచ్చి ఇచ్చాడా? మీ బాబు వచ్చి ఇచ్చాడా? ఎవడిచ్చాడురా మాకు? అసలు మాకు ప్యాకేజీలు అవసరమా? మీలా లక్షల కోట్లు లేవు మా దగ్గర.. మా దగ్గరున్న కొద్ది పాటి డబ్బునైనా పది మందితో పంచుకుంటున్నాం. మీరూ అలా చేయండి. కానీ సన్నాసి మాటలు వద్దు' అన్నారు.

వాడో వెదవ... నీచ్ కమీనే
అనంతరం రాంగోపాల్ వర్మ చేస్తున్న విమర్శల పైనా నాగబాబు ఘాటుగా స్పందించారు. 'రాంగోపాల్ వర్మ అనేవాడు ఒక పెద్ద వెదవ. అలాంటి సన్నాసి.. నీచ్ కమీనే కుత్తేగాడు ఇండస్ట్రీలోనే లేడు. వాడు అవసరం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు' అంటూ కామెంట్స్ చేశారు. ఇక, నాగబాబు చేసిన వ్యాఖ్యలకు జనసేన అభిమానులు మద్దతు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు.