రాంగోపాల్ వర్మ పరువు తీసిన నాగబాబు: ఏ వెధవ అలా చేయడంటూ.. ఏకంగా అంత మాట అన్నాడేంటి!
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతోన్నాయి. ఇప్పటికే అక్కడ అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య వాడీ వేడీ విమర్శలు కనిపిస్తున్నాయి. దీనికితోడు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సైతం ఏపీ పాలిటిక్స్‌పై ఫోకస్ చేస్తూ హైలైట్ అవుతున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవలే జరిగిన ఓ టీవీ డిబెట్‌లో అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆర్జీవీ డీజీపీకి సైతం ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇష్యూపై మెగా బ్రదర్ నాగబాబు ఊహించని పోస్ట్ చేశారు. ఆ వివరాలను మీరే చూడండి!

తల నరికితే కోటి ఇస్తాను: రాంగోపాల్ వర్మ 'వ్యూహం' అనే సినిమాను చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరిగింది. ఈ క్రమంలోనే ఓ న్యూస్ చానెల్‌లో నిర్వహించిన డిబెట్‌లో అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు 'రాంగోపాల్ వర్మ తల నరికి తెచ్చి ఇచ్చిన వాళ్లకు కోటి రూపాయలు' ఇస్తాను అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
డీజీపీకి ఫిర్యాదు చేశాడు: కొలికపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యలను రాంగోపాల్ వర్మ సీరియస్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన దీనిపై సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు చేస్తున్నారు. అనంతరం నేరుగా డీజీపీకి దీనిపై ఫిర్యాదు కూడా చేశారు. ఇందులో తనకు ప్రాణహాని కలిగేలా మాట్లాడిన కొలికపూడి శ్రీనివాసరావుతో పాటు డిబెట్ నడిపిన యాంకర్, చానెల్ హెడ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

నాగబాబు వెరైటీ పోస్టు: కొలికపూడి వ్యాఖ్యలపై రాంగోల్ వర్మ వ్యవహరిస్తున్న తీరుపై తాజాగా మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన దీనిపై ఓ వ్యంగ్య పోస్ట్ చేశారు. అందులో 'ఒకరేమో ఆర్జీవీ తల నరికితే కోటి ఇస్తానన్నారు. దీనికి వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై నా అభిప్రాయం ఏంటంటే అలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పు' అని అన్నారు.
మీరే భయపడకండని: ఇదే పోస్టులో మెగా బ్రదర్ నాగబాబు రాంగోపాల్ వర్మకు వ్యంగ్యంగా ధైర్యం చెప్పారు. 'రాంగోపాల్ వర్మ గారు.. మీరేం భయపడకండి. మీ జీవితానికి ఎలాంటి ఢోకా లేదు. మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో.. ఆ మాటకొస్తే ఇండియాలో ఏ పనికిమాలిన వెధవ మీకెటువంటి హాని తలపెట్టడు' అంటూ రాసుకొచ్చారు.
కమెడియన్ అంటూనే: ఈ పోస్టులో నాగబాబు 'మీకు ఎలాంటి హామీ తలపెట్టరు. ఎందుకంటే.. హీరో విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్ గాడిన ఎవడు చంపడు కదా. అందుకే మీరేం వర్రీ అవకండి. కాబట్టి నిశ్చింతగా, నిర్భయంగా ఓ ఓడ్కా పెగ్గేసి పడుకోండి. ఎల్లపుడు మీ మంచి కోరే మీ శ్రేయోభిలాషి.. నాగబాబు' అంటూ ముగించారు. మొత్తంగా ఇందులో వర్మ పరువును తీసేశారు.

వాళ్లు అలా.. వీళ్లు ఇలా: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మపై మెగా బ్రదర్ నాగబాబు చేసిన పోస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా దీన్ని జనసేన, తెలుగుదేశం పార్టీ అభిమానులు సమర్ధిస్తున్నారు. కాగా, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫ్యాన్స్ మాత్రం విమర్శిస్తున్నారు. దీంతో ఇప్పుడు నాగబాబు చేసిన పోస్టు హాట్ టాపిక్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











