అడ్డ గాడిదలు, పనికిమాలిన సన్నాసులు.. లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి, పవన్‌ని తిడతారు కానీ.. నాగబాబు!
Recommended Video
మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారుతున్నారు. జనసేన పార్టీలో అనూహ్యంగా చేరిన నాగబాబు.. నరసాపురం నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఆంధ్రపదేశ్ లో పర్యటిస్తున్నారు. ఇటీవల గాజువాక నియోజకవర్గంలో జనసేన పార్టీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో నాగబాబు కూడా పాల్గొన్నారు. నాగబాబు తెలంగాణాలో జరిగిన ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

కొంతమంది సన్నాసులు
గాజువాక సమావేశంలో నాగబాబు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ తప్పు లేకున్నా కొంత మంది సన్నాసులు, అడ్డగాడిదలు ఇష్టం వచ్చినట్లు తిట్టారు. ఇలాంటి కామెంట్స్ చేయడం సభ్యత కాకున్నా కడుపు రగిలి మాట్లాడుతున్నా అని నాగబాబు అన్నారు. మా తమ్ముడిని తిడితే తట్టుకోలేను అని అన్నారు. మీరు గురించి పవన్ ఎప్పుడైనా ఒక్క మాట మాట్లాడాడా.. అనవసరంగా మీడియాలో మైకుల ముందు ఎందుకు కామెంట్స్ చేశారు అని నాగబాబు ప్రశ్నించారు.

17మంది విద్యార్థులు చనిపోతే
తెలంగాణాలో 17 మంది విద్యార్థులు చనిపోతే ఒక్క రాస్కెల్ కూడా మాట్లాడలేదు. ధైర్యంగా ప్రశ్నించింది జనసేన మాత్రమే అని నాగబాబు అన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యం, ప్రభుత్వం ఉదాసీనత వల్లే ఇలాంటి పొరపాట్లు జరిగాయని నాగబాబు విమర్శించారు. పవన్ కళ్యాణ్ ని తిట్టేవారికి కేసీఆర్ ని విమర్శించే ధైర్యం లేదని నాగబాబు అన్నారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి
నాగబాబు మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డికి, వైసిపి నేతలకు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం గురించి మాట్లాడే తీరిక ఉంటుంది కానీ, విద్యార్థుల ఆత్మహత్యల గురించి మాత్రం మాట్లాడరు. అసలు లక్ష్మీస్ ఎన్టీఆర్ స్పందించాల్సినంత సమస్యా.. రాష్ట్రంలో ఇంకేమి సమస్యలు లేవా అని నాగబాబు ప్రశ్నించారు. నాగబాబు ఆవేశంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సినీప్రముఖులు
ఆ మధ్యన పవన్ కళ్యాణ్ తెలంగాణ గురించి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా చిన్నికృష్ణ, పోసాని లాంటి సినీప్రముఖులు పవన్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వారి గురించే నాగబాబు పరోక్షంగా కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా నాగబాబు నరసాపురం నియోజకవర్గంలో విజయావకాశాలపై ఉత్కంఠ నెలకొనివుంది. ఫలితం ఏంటనేది తేలాలంటే మే 23 వరకు వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











