పవన్ కల్యాణ్‌ను అలా ఓడించారు.. బాహుబలిని మించేలా సైరా.. నాగబాబు షాకింగ్ కామెంట్స్

Recommended Video

Nagababu Comments On Sye Raa Narasimha Reddy Movie || Filmibeat Telugu

సినీ, టెలివిజన్ రంగాల్లో తనదైన ముద్ర వేస్తున్న నటుడు నాగబాబు. సినిమాల్లో మంచి పాత్రలతో అలరిస్తూనే.. మరోవైపు జబర్దస్త్ కామెడీతో ఆకట్టుకొంటున్నాడు. అంతేకాకుండా సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. యూట్యూబ్‌లో సొంత చానెల్ పెట్టి చైతన్యం కలిగించే మాటలు చెబుతుంటాడు. గత ఎన్నికల ఎంపీగా పోటీచేసి ఓటమి పాలైన నాగబాబు తాజాగా ఫేస్‌బుక్‌లో లైవ్‌లోకి వచ్చారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు చాలా కూల్‌గా సమాధానం చెప్పారు.

టీవీ షో, సినిమాల గురించి

టీవీ షో, సినిమాల గురించి

కొత్తగా నేను టెలివిజన్ షోలు చేయడం లేదు. జబర్దస్త్ ఒక్కటే ప్రస్తుతం కమిట్ అయ్యాను. సినిమాల విషయానికి వస్తే నా ముందుకు వచ్చిన సినిమాలను అంగీకరిస్తున్నాను. ప్రతీ సినిమాకు ఆరు, ఏడు రోజులపాటు షూటింగ్ ఉంటుంది. సినిమా జీవితం అలా సాగిపోతున్నది. మంచి పాత్రలు చేయాలని చూస్తున్నాను అని అన్నారు.

 సైరా నర్సింహారెడ్డి ఎలా ఉంటుందంటే

సైరా నర్సింహారెడ్డి ఎలా ఉంటుందంటే

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రం గురించి నాకు తెలుసు. కథ గురించి పూర్తిగా తెలుసు. అద్భుతమైన స్వాత్రంత్ర్య సమరయోధుడి కథ. సినిమా పరిశ్రమలో గొప్ప చిత్రం అవుతుంది. కొన్ని సీన్లు కూడా చూశాను. తెర మీద బ్రహ్మండంగా ఉన్నాయి. కచ్చితంగా ఓ మంచి సినిమా అవుతుంది అని నాగబాబు చెప్పారు.

బాహుబలిని దాటేస్తుందా అంటే..

బాహుబలిని దాటేస్తుందా అంటే..

ఇక సైరా కలెక్షన్ల గురించి ఇప్పుడే చెప్పడం అత్యుత్సాహం అవుతుంది. బాహుబలి అంత పెద్ద హిట్ అవుతుందా అనే చెప్పడం కష్టం. బాహుబలితో పోల్చి చూడటం సరికాదు. దేశవ్యాప్తంగా ఆకట్టుకొనే గొప్ప సినిమాగా మాత్రం సైరా ఉంటుందని నేను చెప్పగలను. సైరా రిలీజ్ తర్వాత దాని ఇంపాక్ట్ ఏమిటో తెలుస్తుంది అని నాగబాబు అన్నారు.

పవన్‌ కల్యాణ్‌ను అలా ఓడించారు..

పవన్‌ కల్యాణ్‌ను అలా ఓడించారు..

పవన్ కల్యాణ్ ఓటమిపై నాగబాబు స్పందించారు. భీమవరం, గాజువాకలో ఓటమి దారుణం. పవన్ కల్యాణ్‌ను ఓడించడానికి రూ.150 కోట్లు ఖర్చు చేశారని పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పారు. కానీ అంతకంటే ఎక్కువగానే ఖర్చు చేశారని నా అభిప్రాయం. ఎన్నికల్లో పెద్ద మొత్తంలో డబ్బు, అధికార దుర్వినియోగం జరిగింది. కేంద్ర ప్రభుత్వ అధికారులు, యంత్రాంగం పనిచేసింది అని నాగబాబు వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X