పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నాగ బాబు ఫైర్.. చరణ్ బర్త్ డే వేడుకల్లో రచ్చ.. మీకు దమ్ముంటే అంటూ!
తెలుగు ప్రజల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిట్లు ఫ్లాప్‌లు అంటూ తేడా లేకుండా ఎలాంటి క్రేజ్ తగ్గని హీరో ఎవరైన ఉన్నారంటే అది పవన్ కల్యాణ్ అనే చెప్పవచ్చు. సినిమా సినిమాకు క్రేజ్ పెంచుకుంటూ పోయే పవన్ కల్యాణ్ అభిమానులు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఏ హీరో ఫంక్షన్ అయినా పవన్ కల్యాణ్ పేరు మారుమోగిపోవాల్సిందే. ఇక మెగా ఫ్యామిలీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఇంకాస్తా ఎక్కువగానే ఉంటుంది. అయితే మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 26న అభిమానులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ కల్యాణ్ రచ్చ చేశారు. దీంతో నాగబాబు వారిపై అసహనం వ్యక్తం చేశారు.

మంచి కలెక్షన్స్..
చిరుత సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ గా ఎదిగాడు. ఆ తర్వాత విమర్శలు చేసిన వారితోనే ప్రశంసలు కురిపించుకుని మరి గ్లోబల్ స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. మార్చి 27న రామ్ చరణ్ 39వ వసంతంలోకి అడుగు పెట్టాడు. అయితే ఆయన బర్త్ డే వేడుకలు ఆదివారం అంటే మార్చి 26 నుంచి ప్రారంభం అయ్యాయి. ఇదివరకే ఆరెంజ్ మూవీ రీరిలీజ్ కాగా మంచి కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఆసక్తికర విషయాలు..
చెర్రీ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం రోజున మెగా అభిమానులతో ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అతిథిగా నటుడు, నిర్మాత నాగబాబు హాజరయ్యారు. అయితే ఈ వేడుకల్లో పవన్ కల్యాణ్ అభిమానులు కాస్తా అత్యుత్సాహం చూపించడంతో నాగబాబు అసహనం వ్యక్తం చేశారు. తర్వాత రామ్ చరణ్ గురించి పొగుడుతూ పలు ఆసక్తిర విషయాలు పంచుకున్నారు నిర్మాత నాగబాబు.

చాలా కోపంగా ఉండేవాడు..
"మా ఇంట్లో మెగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ మొదటి కొడుకు చరణ్. రామ్ చరణ్.. అన్నయ్య చిరంజీవికి కొడుకే అయినా తనకూ, కల్యాణ్ కు అలాగే మా చెల్లెళ్లకు కూడా కొడుకులాంటివాడే. చరణ్ చిన్నప్పుడు చాలా సైలెంట్ గా, కోపంగా ఉండేవాడు. కానీ ఎదిగేకొద్దీ చాలా మెచ్యూరిటీ వచ్చింది. తనలో నాకు నచ్చే విషయం అదే. ప్రతి ఇంటికి ఇలాంటి కొడుకు ఉండాలనే విధంగా చరణ్ పేరు తెచ్చుకున్నాడు" అని నాగబాబు తెలిపారు.

ఎంతో గర్వంగా ఉంది..
"మా తోబుట్టువులందరికీ చిరంజీవి ఎలా పెద్దగా ఉంటారో తమ తర్వాత తరం వారికి చరణ్ అలా అన్నగా అండగా ఉంటాడు. వాళ్లకు ఏ సమస్య వచ్చినా ముందు రామ్ చరణ్ వద్దకే వెళ్తారు. ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న RRR లాంటి సినిమాలో చరణ్ మేజర్ పార్ట్ అవ్వడం, ఆస్కార్ వేదికపై రామ్ చరణ్ బొమ్మ కనిపించడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఒకప్పుడు బాలీవుడ్ లో చరణ్ ను తక్కువ చేసి మాట్లాడరు. ఇప్పుడు బాలీవుడ్ అంతా చరణ్ వైపు చూస్తోంది" అని నాగబాబు పేర్కొన్నారు.

దయచేసి దండం పెడతా..
ఇక రామ్ చరణ్ గురించి మాట్లాడటానికి ముందు నాగబాబు స్పీచ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే బాల్కనీలో ఉన్న అభిమానులు పవన్ కల్యాణ్ నినాదాలు చేశారు. దీంతో నాగబాబు.. "మాట్లాడతాను. కాస్తా ఆగండి. కల్యాణ్ బాబు గురించి కొద్దిసేపటి తర్వాత మాట్లాడదామని అనుకున్నా. ఇలా అల్లరి చేస్తే అసలు కంటెంట్ పోతుంది. ప్లీజ్ దయచేసి దండం పెడతా. కొంచెం సేపు సైలెంట్ గా ఉండండి" అని కోరారు. అయినా కూడా కొందరు పదే పదే పవర్ స్టార్ సీఎం.. పవర్ స్టార్ సీఎం అంటూ నినాదాలు చేశారు.
అదే సంస్కారం.. ఇచ్చే బహుమతి..
"మనం ఇవాళ వచ్చింది చరణ్ బర్త్ డే వేడుకలకు. కాబట్టి మొదటి గౌరవం చరణ్ కు ఇవ్వాలి. అది మన సంస్కారం. జనసేన సైనికులు ఆ సంస్కారాన్ని వదులుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా" అని నాగబాబు చెప్పారు. అయినా కానీ అరుపులు, నినాదాలు ఏమాత్రం ఆగలేదు. కొద్దిసేపు నిశబ్దంగా ఉన్న నాగబాబు "పవన్ కల్యాణ్ చాలాసార్లు చెప్పారు కదా. సీఎం సీఎం అని అరిస్తే కాదు.. ఓట్లు గుద్ది సీఎంను చేయాలి. కాబట్టి సీఎం అని అరిస్తే సరిపోదు. మీకు దమ్ముంటే ఎలక్షన్స్ లో పాల్గొని జనాల్ని మోటివేట్ చేయండి. అది వపన్ కల్యాణ్ కు మనం ఇచ్చే గొప్ప బహుమతి" అని ఫైర్ అయ్యారు. తర్వాత పవన్ కల్యాణ్ గురించే మాట్లాడటానికే వచ్చానని నవ్వుతూ చరణ్ గురించి స్పీచ్ కొనసాగించారు.


Click it and Unblock the Notifications











