షాకింగ్ పిక్: బాలయ్యతో పవన్ కళ్యాన్.. మీరు మారిపోయారు సార్!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మార్పులు ఎన్ని వచ్చినా కూడా ఒక అభిమానం అనే పాయింట్ లో మాత్రం తేడా రాలేదు. ఫ్యాన్స్ వార్స్ ఇంకా ఎక్కువయ్యాయని సోషల్ మీడియాపై ఒక లుక్కేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇక స్టార్ హీరోలు కలిస్తే ఆ మూమెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది. మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల ఒక స్పెషల్ ఫోటో షేర్ చేశారు. బాలకృష్ణతో పవన్ కళ్యాణ్ కనిపించడం ఆడియెన్స్ ని ఆశ్చర్యపరిచింది.

రాజకీయాల కారణంగా..
సినిమాలు విడుదలైనప్పుడు హీరోల మనసులో పోటీ తత్వం ఎంతవరకు ఉంటుందో తెలియదు గాని అభిమానుల్లో మాత్రం ఆ డోస్ ఎక్కువగానే ఉంటుంది. మెగా నందమూరి అభిమానుల మధ్య గతంలో చాలా సార్లు వార్స్ జరిగాయి. ఇక రాజకీయాల కారణంగా బాలయ్య బాబు, మెగా హీరోల మధ్య దూరం పెరిగింది.

పవన్ మొదటి సినిమా
పొలిటికల్ ఎంట్రీకి ముందు బాలకృష్ణ మెగా హీరోలతో చాలా స్నేహంగా ఉండేవారు. నందమూరి హరికృష్ణ కూడా మెగా ఫ్యామిలీతో సన్నిహితంగా ఉండేవారు. ఇక బాలకృష్ణ, పవన్ కి సంబంధించిన ఈ ఫోటో విషయానికి వస్తే.. సుస్వాగతం సినిమా లాంచ్ అయిన రోజు. బాలకృష్ణతో పాటు పవన్ ని విష్ చేయడానికి వేరే హీరోలు కూడా వచ్చాడు.

చాలా కాలం తరువాత ఆ స్పెషల్ ఫోటో
మెగాస్టార్ బ్రదర్ గా పవన్ కళ్యాణ్ హీరోగా లాంచ్ అవుతున్నాడని వెంకటేష్ అలాగే బాలక్రిష్ణ స్పెషల్ గా విష్ చేయడానికి షూటింగ్ స్పాట్ కి వచ్చిన విధానం అప్పట్లో ఇరు వర్గాల అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక చాలా కాలం తరువాత మళ్ళీ ఆ స్పెషల్ ఫోటోను నాగబాబు చూపించడంతో ఒక్కసారిగా ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Recommended Video

మీరు మారిపోయారు సార్..
ఇక నాగబాబు పోస్ట్ చేసిన విషయానికి వస్తే.. గతంలో చాలా ఇంటర్వ్యూలలో బాలయ్య ఎవరో తనకు తెలియదని సెటైర్ వేసిన నాగబాబు ఇప్పుడు బ్రదర్ ఆఫ్ అనొథెర్ మదర్ అనే క్యాప్షన్ తో ఈ ఫోటోను షేర్ చేయడంతో సోషల్ మీడియాలో అభిమానులు విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. మీరు మారిపోయారు సార్.. అంటూ డైలాగ్స్ తో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











