Just In
- 25 min ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 1 hr ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 1 hr ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
- 2 hrs ago
యాంకర్స్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
Don't Miss!
- Finance
భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా
- Lifestyle
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- News
అయోధ్య రామ మందిరానికి రఘురామకృష్ణ రాజు విరాళం.. ఎంత మొత్తం అంటే..
- Automobiles
అప్పుడే అయిపోయాయ్.. సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేశారు..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆద్యను ప్రేమగా హత్తుకున్న చిరు.. కొణిదెల కుటుంబం.. నాగబాబు ఎమోషనల్ పోస్ట్
నిహారిక పెళ్లి ఈవెంట్ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. మరీ ముఖ్యంగా ముగ్గురు మెగా బ్రదర్స్ అలా ఒకే ఫ్రేమ్‌లొ కనిపించడం, మెగా హీరోలందరూ ఇలా ఒకే చోట కనిపించడం కన్నుల పండువగా ఉంది. ఇది కేవలం మెగా ఫ్యామిలీ ఈవెంట్‌లా లేదని టాలీవుడ్ మొత్తం అక్కడే ఉన్నట్టు కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నిహారిక పెళ్లి ఫోటోలు ఎన్ని బయటకు వచ్చినా కూడా అందరి కళ్లు అకిరా, ఆద్యల మీదే ఉంటోంది.

పెళ్లికి స్పెషల్ అట్రాక్షన్..
పవన్ కళ్యాణ్ రానంత వరకు పెళ్లిలో ఏదో అసంపూర్ణంగా ఉందంటూ ఫ్యాన్స్ నిరాశ చెందారు. అసలు పవన్ కళ్యాణ్ వస్తాడా? లేదా? అని చివరకు ఆందోళన చెందారు. పవన్ కళ్యాణ్ పెళ్లికి వెళ్లకపోతే ఎలా.. ఆ ఈవెంట్ పవన్ కనిపించకపోతే ఎలా.. ఎప్పుడు వస్తాడంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు అభిమానులు. చివరకు పవన్ కళ్యాణ్ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు.

నిండుదనంగా..
పవన్ కళ్యాణ్ ఒక్కడే రావడం కాదు.. తనతో పాటు తన పిల్లలు అకీరా నందన్, ఆద్యలను కూడా తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ పెళ్లిలో ఈ ఇద్దరే సెంటరాఫ్ అట్రాక్షన్ అయ్యారు. మరీ ముఖ్యంగా అకీరాను చూసి ఫ్యాన్స్ అందరూ సంబరపడిపోతున్నారు. మెగా హీరోలందరిలోనూ ఆజానుభావుడిగా ఉన్నాడు.

మెగా ప్రేమ..
ఇక అకీరా, ఆద్యలపై మెగా ఫ్యామిలీ కురిపిస్తోన్న ప్రేమకు నిదర్శనంగా ఓ ఫోటో బయటకు వచ్చింది. కొణిదెల సకుటుంబ సపరివారి సమేతంగా... అంటూ నాగాబాబు అదిరిపోయే ఫోటోను షేర్ చేశాడు. అందులో మెగా బ్రదర్స్ ముగ్గురూ ఉన్నారు.

ఆద్యను హత్తుకున్న చిరు..
అయితే ఆ ఫోటోలో ఆద్యను గట్టిగా హత్తుకుని చిరు నిల్చున్నాడు. చిరు పక్కనే సురేఖ నిల్చున్నారు. వదిన పక్కనే పవన్ కళ్యాణ్ నిల్చున్నారు. పవన్ కళ్యాణ్ పక్కనే కొత్త జంట.. వారి పక్కన నాగబాబు జంట నిల్చున్నారు. మొత్తానికి ఈ ఫోటోలోనూ అకీరా, ఆద్యలే హైలెట్ అవుతున్నారు.

ఆ ఇద్దరూ కూడా..
అయితే ఈ కొణిదెల కుటుంబంలో రామ్ చరణ్, ఉపాసన,వరుణ్ తేజ్ కూడా ఉండుంటే సంపూర్ణంగా అనిపించేది. మొత్తానికి అకీరా, ఆద్యలను మాత్రం మెగా ఫ్యామిలీని చెప్పనకనే చెప్పేశారు. ఇక అకీరా నందన్ సినీ ఎంట్రీకి కూడా సన్నాహాలు చేస్తోన్నారని ఇన్ సైడ్ టాక్.