ఆ హీరోయిన్‌తో వరుణ్ తేజ్ వివాహం: నాగబాబు పోస్టుతో షాకైన ఫ్యాన్స్.. మధ్యలోనే వెళ్లిపోతానంటూ కోపంగా!
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బుల్లితెరపైనా సందడి చేస్తూ చాలా కాలంగా తన హవాను చూపిస్తున్నారు మెగా బ్రదర్ నాగబాబు. వరుస పెట్టి సినిమాలు.. షోలు చేయకున్నా ఆయన మాత్రం ఎప్పుడూ వార్తల్లోనే నిలుస్తున్నారు. దీనికి కారణం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండడంతో పాటు తరచూ ఏదో ఒక అంశంపై మాట్లాడడమే. ఇప్పటికే ఎన్నో విషయాలతో హైలైట్ అయిన ఆయన.. తాజాగా తన కుమారుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇందులో హీరోయిన్‌ను కూడా ఎంటర్ చేయడంతో రచ్చ అయింది. ఆ సంగుతులు మీకోసం!

ఇప్పుడు అదొక్కటే.. మిగిలినవన్నీ స్టాప్
చాలా కాలం పాటు జబర్ధస్త్ షోకు జడ్జ్‌గా వ్యవహరించారు నాగబాబు. ఆ తర్వాత దానికి గుడ్‌బై చెప్పేసి.. మరో చానెల్‌లో అదిరింది అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత దీన్నే బొమ్మ అదిరింది పేరిట ప్రసారం చేశారు. కొద్ది రోజులకు ఇది కూడా ఆపేశారు. అప్పటి నుంచి యూట్యూబ్ ఛానెల్‌లో 'ఖుషీ ఖుషీగా' అనే స్టాండప్ కామెడీ షోను నడుపుతున్నారు. ఇది ఫినాలేకు చేరింది.

ఎప్పుడూ అందులోనే.. ఈ మధ్య సెషన్స్
నాగబాబు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విశేషాలను కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటారు. అలాగే, సమాజంలో జరిగే ఎన్నో అంశాలపై తనదైన కామెంట్ చేస్తున్నారు. ఈ మధ్య ఎక్కువగా ఫ్యాన్స్‌తో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌లు నిర్వహిస్తూ సందడి చేస్తున్నారు.
వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ ఫ్యాన్స్ హంగామా... ఆకట్టుకొన్న డ్రమ్మర్ శివమణి

వరుణ్ తేజ్ పెళ్లిపై నాగబాబు చెప్పడంతో
ఆ మధ్య ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు మెగా బ్రదర్ నాగబాబు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ వివాహంపై ఆయన తొలిసారి స్పందించారు. 'మేము వరుణ్ బాబుకు సంబంధాలు చూస్తున్నాం. వాడు మాత్రం ఇప్పుడే వద్దంటున్నాడు. ఒకవేళ చేసుకున్నా బయటి విషయాలపై స్పందిస్తూ, ప్రొఫెషనల్‌గా ఉండే అమ్మాయి కావాలి అంటున్నాడు' అని ఆయన చెప్పుకొచ్చారు.

వరుణ్ తేజ్ పెళ్లి గురించి అప్పుడలా ప్రశ్న
కొద్ది రోజుల క్రితం నాగబాబు ఇన్‌స్టాగ్రామ్ చాట్ నిర్వహించిన సమయంలో ఓ నెటిజన్ 'వరుణ్ అన్న మ్యారేజ్ ఎప్పుడు చేస్తారు బాస్' అని ప్రశ్నించాడు. పెళ్లి చూపులు అని రాసున్న ఓ ఫొటోను వదిలిన ఆయన.. 'మంచి సంబంధాలు ఉంటే మీరే చూడండి' అంటూ కామెంట్ చేశారు. దీంతో మెగా ప్రిన్స్ కోసం అమ్మాయిని వెదికే పనిలో ఉన్నామని పరోక్షంగా వెల్లడించారాయన.

అలాంటి అమ్మాయినే చేసుకున్నా చేస్తాం
ఇదే చాట్‌లో మరో నెటిజన్ స్పందిస్తూ.. 'వరుణ్ ఓ మిడిల్ క్లాస్ అమ్మాయితోనే లైఫ్ అనుకుని.. మరో ఆలోచనే లేదు అంటే మీరు ఏం చేస్తారు' అని ఓ ప్రశ్న అడిగాడు. దీనికి నాగబాబు 'మీకూ మీకూ ఓకే అయితే నేనేమంటా' అంటూ తేల్చేశారు. తద్వారా తన కుమారుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నా అభ్యంతరం లేదన్నట్లుగా చెప్పారు. దీంతో ఈ స్క్రీన్ షాట్స్ వైరల్ అయిపోయాయి.

హీరోయిన్‌తో వరుణ్ తేజ్ పెళ్లి అంటూ ఇలా
నాలుగు రోజుల క్రితం నాగబాబు మరోసారి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించి.. నెటిజన్లు ఎన్నో రకాల ప్రశ్నలు అడిగారు. వాటన్నింటికీ మెగా బ్రదర్ తనదైన శైలిలో సమాధానాలు చెప్పాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ వరుణ్ తేజ్ పెళ్లి గురించి ఊహించని కామెంట్ చేశాడు. 'హీరోయిన్ సాయి పల్లవితో వరుణ్ అన్న పెళ్లి చేస్తే బాగుంటుంది సార్' అని అన్నాడు.

మధ్యలోనే వెళ్లిపోతానంటూ కోపంగా పోస్టు
వరుణ్ తేజ్ - సాయి పల్లవి పెళ్లి గురించి నెటిజన్ అడిగిన ప్రశ్నకు 'జాతి రత్నాలు' సినిమాలోని క్లైమాక్స్ సీన్ వీడియోను పోస్ట్ చేశారు నాగబాబు. అందులో జడ్జ్ స్థానంలో ఉన్న బ్రహ్మానందం 'తీర్పు మీరు మీరు చెప్పుకోండిరా. నేనేందుకు ఇక్కడి నుంచి వెళ్లిపోతాలే' అనే డైలాగ్ చెబుతారు. దాన్నే నాగబాబు పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ తెగ హల్‌చల్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











