పూరి దర్శకత్వంలో మెగా ఫ్యామిలి నుండి వరుణ్ తేజ్..
ఇప్పటికే రామ్ చరణ్ తేజ్ అనే తేజం తెలుగు తెరపై వెలుగులు విరజిమ్ముతోంది. ధరమ్ తేజ్ అనే మరో తేజం వెలుగులు విరజిమ్మేందుకు రాత్రి పగలు కష్టపడుతోంది. ఇక పోతే..మరో తేజం కూడా తెలుగు సినీ వినీలాకాశంలో వెలుగులు విరబూసేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది. చిరంజీవి అక్క కొడుకు ధరమ్ తేజ్ వైవియస్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న 'రేయ్" చిత్రం ద్వారా త్వరలో రంగప్రేవేశం చేయనుండడం తెలిసిందే.
కాగా, మెగా ఫ్యామిలీ నుండి మరో తేజం తెలుగు తెరంగేట్రం చేసేందుకు తహతహలాడిపోతూ..అందుకు అవసరమైన శిక్షణా కార్యక్రమాల్లో మునిగితేలుతోంది. చిరంజీవి సోదరుడు, నటుడు, నిర్మాత అయిన నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తో హీరోగా రంగప్రవేశం చేయించేందుకు ఏర్సాట్లు చకచకా జరిగిపోతున్నాయి. వచ్చే ఏడాది వేసవిలో వరుణ్ తేజ్ హీరోగా సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశముందని, ఈ చిత్రానికి నాగబాబుకు అత్యంత ఆత్మీయమిత్రుడు శ్రేయోభిలాషి అయిన పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











