భయపడే..పవన్ పెళ్ళి

ఇక పవన్‌కళ్యాణ్, రేణు దేశాయ్‌ని వివాహం చేసుకోవడంతో ప్రజారాజ్యం పార్టీలో కోలాహలం మిన్నంటింది. మరీ ముఖ్యంగా పవన్‌కళ్యాణ్ అభిమానులు పార్టీ కార్యాలయం వద్దకు చేరుకుని సందడి చేశారు. పవన్‌కళ్యాణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానులు పోటీపడ్డారు.
నందిని విడాకుల వ్యవహారం నేపథ్యంలో రేణూదేశాయ్‌తో పవన్ సహజీవనం చర్చనీయాంశంగా మారింది. అలాగే ప్రజారాజ్యం పార్టీ నెలకొల్పి, పవన్ యువ సారథ్య బాధ్యతలు చేపట్టాక విపక్షాలు వ్యక్తిగత విమర్శలతో ముప్పేట దాడి మొదలెట్టాయి. పవన్ మొదట సహజీవనం కరెక్టేనంటూ సమాధానం చెప్పినా,పోసాని వంటి వారితో చెప్పించినా పెద్దలు నచ్చజెప్పడంతో కొద్దిగా వెనక్కు తగ్గారని తెలుస్తోంది.
తర్వాత పెద్దలు, కుటుంబ సభ్యుల సూచన మేరకు పవన్‌కళ్యాణ్, రేణూ దేశాయ్‌ను వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డారు. అభిమాన కోలాహలాన్ని తప్పించుకోవడానికి పవన్ ప్రయత్నించి వివాహ విషయాన్ని రహస్యంగా ఉంచినా లాభం లేకపోయింది. వివాహానంతరం పవన్ స తీసమేతంగా మీడియా ముందుకు వచ్చి తన మనోభిష్టాన్ని వివరించారు.
ఇదిలాఉండగా, జూబ్లీహిల్స్‌లోని ఆర్యసమాజ్‌లో జరిగిన పవన్ వివాహానికి నాగబాబు, అల్లు అరవింద్, రామ్‌చరణ్‌తేజ, పూరిజగన్నాథ్, గణేష్ తదితరులు హజరయ్యారు. ఈ కార్యక్రమానికి అభిమానులు, పీఆర్పీ కార్యకర్తలు హాజరుకాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వివాహం అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ వివాహం అనేది రెండు హృదయాల మధ్య జరిగే తంతుగా పేర్కొన్నారు


Click it and Unblock the Notifications











