కాబోయే అల్లుడికి నాగబాబు ఏమిస్తున్నారో తెలుసా.. అది కట్నం కాదు కానుకలు మాత్రమే..
సెలబ్రెటీలు ఒక చిన్న పార్టీ కోసమే పాతికలక్షలు తక్కువ కాకుండా ఖర్చు చేస్తారు. ఇక పెళ్లి వేడుకలకు అంతకు మించిన రేంజ్ లో ఎవరు ఊహించని విధంగా ఖర్చులు ఉంటాయి. ఇక గత కొన్ని వారాలుగా కొణిదెల వారి పెళ్లి వేడుకలపై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. చైతన్య , నిహారిక ఎంతగా దగ్గరయ్యారో సోషల్ మీడియాలో వారి ఫొటోలు చూస్తేనే అర్ధమవుతోంది. ఇక కట్న కానుకలపై కూడా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.

నాగబాబు కూడా అదే తరహాలో..
ఏమి అడగకపోయినా కూడా కాబోయే అల్లుడి రేంజ్ కి తగ్గట్లుగా లాంఛనాలు ఉండాలి. ఏ కూతురు తండ్రి అయినా కూడా తన అల్లుడు నలుగురిలో చాలా గొప్పగా ఉండాలని కోరుకుంటారు. ఇక కుమార్తెనే అత్తవారింటికి పంపినప్పుడు ఖాళీ చేతులతో పంపితే బావుండదని స్తోమతకు తగ్గట్లుగా కానుకలు ఇచ్చి పంపుతారు. ఇక నాగబాబు కూడా అదే తరహాలో ప్లాన్ చేసి రెడీగా ఉంచినట్లు తెలుస్తోంది.

నిహారిక పేరు మీద బంగ్లా
నాగబాబు మాత్రమే కాకుండా కొడుకు వరుణ్ తేజ్ కూడా గత కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఆదాయాన్ని గట్టిగానే అందుకుంటున్నాడు. ఇక చెల్లి పెళ్లి కోసం ఇప్పటికే ఖర్చలన్ని తనపై వేసుకున్నాడు. అయితే నాగబాబు నీహారిక పేరు మీద హైదరాబాద్ లోని ఒక బంగ్లాను కొనుగోలు చేసినట్లు టాక్ వస్తోంది. పూర్తిగా అది నిహారికకు చెందేలా చేశారట.

గుంటూరులో పొలాలు..
చైతన్య ఫ్యామిలీ కూడా ఆస్తుల విషయంలో నగబాబు ఫ్యామిలీ కంటే ఎక్కువ కాకపోయినా వారి రేంజ్ కి తగ్గట్లు సెటిల్ చేసుకున్నారు. గుంటూరులో వారికి పొలాలు గట్టిగానే ఉన్నట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో తెలియదు గాని నిహారికకు మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా ఖరీదైన నెక్లెస్ చేయించబోతున్నట్లు మరో టాక్ వస్తోంది.

10కోట్ల వరకు లాంఛనాలు
కొన్ని మీడియాలలో వస్తున్న కథనాల ప్రకారం అల్లుడికి నాగబాబు 10కోట్ల వరకు లాంఛనాలు అందిస్తున్నట్లు టాక్ వస్తోంది. ఇక నిహారిక బంగారం విలువ రూ.2కోట్లకు పైగానే ఉంటుందని కథనాలు వెలువడుతున్నాయి. డిసెంబరు 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ముహూర్తం ఫిక్స్ అయిన విషయం తెలిసిందే.
Recommended Video

పెళ్లి ఏర్పాట్లలో బిజీగా వరుణ్ తేజ్
ఇటీవల అఫీషియల్ గా చైతన్య తండ్రి పెళ్లి ముహూర్తం గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఉన్న ఉదయ్ విలాస్‌ను వివాహ వేదికగా ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే నాగబాబు ఫ్యామిలీ అక్కడికి చేరుకుంది. తన సన్నిహితులతో కలిసి వరుణ్ తేజ్.. ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











