»   » ఈ దాడి సహించం: చీపురుతో కొడుతున్న వీడియోతో నాగబాబు సంచలనం!

ఈ దాడి సహించం: చీపురుతో కొడుతున్న వీడియోతో నాగబాబు సంచలనం!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  చీపురుతో కొడుతున్న వీడియోలతో నాగబాబు సంచలనం!

  హిందువులు దేవుడుగా ఆరాధించే శ్రీరాముడి మీద కొందరు వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సినీ నటుడు, నిర్మాత నాగబాబు తీవ్రంగా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. హిందూ మతంపై, హిందూ సంస్కృతిపై దాడి జరుగుతోంది అంటూ ఆయన తనదైన వాదన వినిపించారు. ఈ సందర్భంగా నాస్తిక వాదం, హేతువాదంపై విమర్శలు చేశారు. నేను హిందూ సెక్యూలర్‌ను అని చెప్పుకున్న మెగాబ్రదర్ అన్ని మతాలను గౌరవిస్తూనే తన హిందూ మతంపై జరుగుతున్న దాడిని అడ్డుకునే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా సోషల్ మీడియాలో వరుస వీడియోలు పోస్టు చేశారు.

  విదేశీయులు ఆసక్తి చూపుతుంటే మీరేంటి ఇలా?

  విదేశీయులు ఆసక్తి చూపుతుంటే మీరేంటి ఇలా?

  మన భారత దేశంలో నాస్తిక వాదం, హేతువాదం ఇలా రకరకాల పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ వారి వాదాన్ని వ్యాప్తి చేసుకుంటున్నారు. అలా చేసుకుంటూ హిందూ దేవుళ్లను, హిందూ మతాన్ని, హిందూ సంస్కృతిని ధ్వంసం చేయడానికి పూనుకున్నటువంటి వ్యక్తులు మన దేశంలోనే ఉన్నారు... అని నాగబాబు ఫైర్ అయ్యారు.

  ఈ కుర్రాడిని చూసి నేర్చుకోండి

  మన దేశంలోని వారు కొందరు మన సంస్కృతి మీద దాడి చేస్తుంటే .... చాలా మంది విదేశీయులు మన సంస్కృతి మీద ఆసక్తి, గౌరవం చూపుతున్నారు. అందుకు ఈ కుర్రాడే సాక్ష్యం.... అంటూ నాగబాబు ఓ వీడియోను పోస్టు చేశారు.

  చీపురుతో కొడుతున్న వీడియో పోస్టు చేసిన నాగబాబు

  ఈ సందర్భంగా నాగబాబు తన ఫేస్‌బుక్ పేజీలో ఓ స్వామీజీ కొందరిని చీపురుతో కొడుతున్న వీడియోను పోస్టు చేయడం చర్చనీయాంశం అయింది. స్వామి తమరు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ కు వస్తారు ఇక్కడ చాలామందికి ఇలాంటి ఆశీర్వాదం కావాలి అని నాగబాబు పేర్కొనడం గమనార్హం.

  లండన్లో ఉండటం వల్ల రాలేక పోయాను

  హిందూ ధర్మాగ్రహ యాత్రకి అందరు హాజరు కావాలని, హిందువుల ఐకమత్యం చూపాలని నాగబాబు కోరారు. అయితే తాను షూటింగ్ నిమిత్తం లండన్లో ఉండటం వల్ల వెళ్లలేక పోయాను అని ఆయన మరో వీడియోలో వెల్లడించారు.

  English summary
  Nagababu STRONG Counter to Rationalists with british kid ZbigsBujji. Rationalists's controversial remarks on Hindu God Lord Rama has kicked up a huge uproar among the devotees and followers of the God. The latest to raise the strong voice against Rationalists in the issue is actor and Mega producer Naga Babu who vented out his anger against them.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more