అరవింద సమేతకు పెద్ద చిక్కే వచ్చింది.. మెగా బ్రదర్ ఇప్పుడెలా!
Recommended Video

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం అరవింద సమేత. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం ఇది. ఇటీవల విడుదలైన టీజర్ అభిమానుల చేత కేకలు పెట్టించింది. ఈ చిత్రం అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలిసారి రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. తాజాగా ఈ చిత్రానికి పెద్ద చిక్కే వచ్చింది.

మాస్ ఎలిమెంట్స్
ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా త్రివిరం శ్రీనివాస్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎన్టీఆర్ స్టైల్ కు తగ్గట్లుగా ఈ చిత్రంలో పోరాట సన్నివేశాలు అభిమానులని అలరించనున్నట్లు తెలుస్తోంది.

మెగా బ్రదర్
రాయలసీమ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. టీజర్ లో రాయలసీమ యాసలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ఎన్టీఆర్ తండ్రిగా మెగా బ్రదర్ నాగబాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలోని నాగబాబు స్టిల్స్ ఇటీవల లీకైన సంగతి తెలిసిందే.

నాగబాబు వాయిస్
అరవింద సమేత చిత్రానికి ప్రస్తుతం పెద్ద చిక్కే వచ్చింది. గతః కొంత కాలంగా నాగబాబు గొంతు సరిగాలేదు. గొంతు సమస్యతో ఆయన భాదపడుతున్నారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన సందర్భంలో కూడా ఆయన వాయిస్ లో మార్పు స్పష్టంగా కనిపించింది.

త్వరలో డబ్బింగ్
ఇప్పటికి నాగబాబుకు ఆ సమస్య అలాగే ఉంది. త్వరలో అరవింద సమేత డబ్బింగ్ కార్యక్రమాలు ఉండడంతో చిత్ర యూనిట్ ని ఈ సమస్య కలవరపెడుతోంది. ఇటీవల విడుదలైన గీత గోవిందం చిత్రంలో కూడా నాగబాబు పాత్రకు మరో వ్యక్తితో డబ్బింగ్ చెప్పించారు. నాగబాబుకు ఆ వాయిస్ సరిపోలేదు. ఆ చిత్రంలో నాగబాబు పాత్ర చిన్నది కావడంతో అలా గడచిపోయింది.

పవర్ ఫుల్ రోల్
అరవింద సమేత చిత్రంలో నాగబాబు ఫ్యాక్షన్ లీడర్ గా పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. అలాంటి పాత్రకు వేరే వారిచే డబ్బింగ్ చెప్పించాల్సి వస్తే సినిమాపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నాగబాబు వాయిస్ కు జనాలు బాగా అలవాటైపోయారు. ఈ సమస్యని త్రివిక్రమ్ ఎలా అధికమిస్తాడో మరి.


Click it and Unblock the Notifications











