జగన్‌కు అండగా నాగబాబు: ‘వకీల్ సాబ్’ ఇష్యూకు కారణం వాళ్లేనని కామెంట్.. ఓటు కూడా వైసీపీకే అంటూ!

సుదీర్ఘ విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన చిత్రమే 'వకీల్ సాబ్'. ఎన్నో అంచనాల నడుమ విడుదలై ఈ మూవీకి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. తద్వారా కలెక్షన్లు కూడా రికార్డులు బద్దలు కొట్టేలా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఈ సినిమా కంటే దాని వెనుక ఉన్న వివాదం హైలైట్ అవుతోంది. అదే.. ఈ చిత్రం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరు. ఇది రాజకీయంగా కూడా చర్చనీయాంశం అయింది. తద్వారా కోర్టు వరకూ వెళ్లిందీ మేటర్. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం జగన్‌కు నాగబాబు అండగా నిలిచాడు. ఆ సంగతులు మీకోసం!

లాయర్‌గా మారిపోయిన పవన్ కల్యాణ్

లాయర్‌గా మారిపోయిన పవన్ కల్యాణ్

రాజకీయాల కోసం గ్యాప్ ఇచ్చి.. దాదాపు మూడేళ్ల తర్వాత 'వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించాడు. అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రలు చేశారు.

అదిరిపోయిన టాక్... వీకెండ్‌లో భారీగా

అదిరిపోయిన టాక్... వీకెండ్‌లో భారీగా

'వకీల్ సాబ్' మూవీకి అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఈ చిత్రం పవన్ కల్యాణ్‌కు పర్‌ఫెక్ట్ కమ్ బ్యాక్ అని అంతా అంటున్నారు. టాక్‌కు అనుగుణంగానే కలెక్షన్లనూ సాధించిందీ చిత్రం. వీకెండ్‌లోనే ఏకంగా రూ. 70 కోట్లు వరకూ వసూలు చేసినట్లు తెలుస్తోంది. అంటే దాదాపు 70 శాతం రికవరీ చేసినట్లు. అదే సమయంలో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది.

ఏపీ ప్రభుత్వం నుంచి ఎదురుదెబ్బలు

ఏపీ ప్రభుత్వం నుంచి ఎదురుదెబ్బలు

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆశలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. కరోనా విజృంభిస్తోన్న వేళ స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు వద్దని చెబుతూ వాటికి అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ షోలు పడకపోవడంతో ఫ్యాన్స్ అంతా నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. అదే సమయంలో టికెట్ ధరల విషయంలోనూ ప్రభుత్వం షాకిచ్చింది.

సీఎం జగన్‌ తీరుపై అభిమానుల ఫైరింగ్

సీఎం జగన్‌ తీరుపై అభిమానుల ఫైరింగ్


స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు రద్దు చేసిన జగన్ సర్కారుపై పవన్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. దీంతో ట్విట్టర్ వేదికగా సీఎంను విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. సినిమాల విషయంలోనూ రాజకీయాలు చేయడం తగదని హితవు పలుకుతున్నారు. అదే సమయంలో బీజేపీ నాయకులు ఎంట్రీ ఇవ్వడంతో ఇది రాజకీయ తగాదాకు కారణం అయిపోయింది కూడా.

సీఎం జగన్‌కు అండగా నాగబాబు పోస్ట్

సీఎం జగన్‌కు అండగా నాగబాబు పోస్ట్

'వకీల్ సాబ్' వివాదం చిలికి చిలికి గాలి వానలా మారిపోతోంది. దీనిపై అటు సినీ పరిశ్రమలోనూ.. ఇటు రాజకీయ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. దీంతో ఈ సినిమాకు మద్దతుగా ఎంతో మంది తమ గొంతును వినిపిస్తున్నారు. ఇటీవల మాజీ సీఎం చంద్రబాబు సైతం దీన్ని ఖండించారు. ఇలాంటి పరిస్థితుల్లో మెగా బ్రదర్ నాగబాబు.. ఏపీ సీఎం జగన్‌కు అండగా నిలిచారు.

‘వకీల్ సాబ్’ ఇష్యూకు కారణం వాళ్లేనని


తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా 'వకీల్ సాబ్' ఇష్యూపై మాట్లాడారు నాగబాబు. 'ఈ సినిమాకు షోలు రద్దు చేయడం వల్ల నష్టమేమీ జరగలేదు. నా నాలెడ్జ్ ప్రకారం.. జగన్ ఇలాంటి పనులు చేస్తారని అనుకోవడం లేదు. ఆయన చంద్రబాబు, బీజేపీ మీద పోరాటం చేస్తున్నారు. నాకు తెలిసి వైసీపీలోని నాయకులే ఈ వివాదానికి కారణం' అని చెప్పుకొచ్చారు మెగా బ్రదర్.

ఓటు కూడా వైసీపీకే వేసుంటాడు అంటూ

ఓటు కూడా వైసీపీకే వేసుంటాడు అంటూ

నాగబాబు.. జగన్‌కు మద్దతుగా చేసిన కామెంట్లపై పవన్ కల్యాణ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఓ ఫ్యాన్.. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. 'ఈ వీడియో చూసిన తర్వాత 2019లో నాగబాబు కూడా వైసీపీకే ఓటు వేశాడనిపిస్తుంది' అంటూ పోస్టు పెట్టారు. ఈ ట్వీట్‌కు పవర్ స్టార్ అభిమానుల నుంచి మద్దతు వస్తోంది. అనుకూలంగా కామెంట్లూ వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X