పవన్ మూవీలో అనసూయ, మెగాబ్రదర్ హ్యాండ్?

By Bojja Kumar

హైదరాబాద్ : టీవీ యాంకర్, హాట్ అండ్ సెక్సీ బ్యూటీ అనసూయ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న 'అత్తారింటికి దారేది' చిత్రంలో చాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఉన్నట్టుండి ఒక సాధారణ యాంకర్‌కు పవన్ సినిమాలో చాన్స్ ఏమిటా? అంటూ అంతా ఆశ్చర్యపోయారు.

ఎంతో మంది హాట్ అండ్ సెక్సీ పాపులర్ బ్యూటీలు ఉండగా ఈమెనే ఎందుకు తీసుకున్నారనే విషయం మొదట్లో చాలా మందికి అర్థం కాలేదు. అఫ్ కోర్స్...అనసూయ కూడా అందంగా, సెక్సీగా హాట్ లుక్‌తో ఉంటుందనుకొండి. అయితే ఈ చిత్రంలో అనసూయకు ఛాన్స్ దక్కడం వెనక మెగా బ్రదర్ నాగబాబు ఆశీస్సులు ఉన్నాయనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది.

అనసూయ యాంకరింగ్ చేస్తున్న 'జబర్దస్త్' కామెడీషోలో మెగా బ్రదర్ నాబాబుతో పాటు, రోజా జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో నాగబాబుతో బాగా పరిచయం పెంచుకున్న అనసూయ ఆయన ద్వారా పవన్ కళ్యాణ్ సినిమాలో చాన్స్ దక్కించుకున్నట్లు చర్చించుకుంటున్నారు.

అత్తారింటికి దారేది చిత్రంలో కాలేజీలో ప్రేమించమంటూ పవన్ కళ్యాణ్ వెంట పడే అమ్మాయిగా ఆమె కనిపిస్తుందట. ఆమెతో ఇందులో ఐటం సాంగు కూడా చేయిస్తున్నారట. మొదట ఐపీఎల్ యాంకర్ రోచెల్లీ రావును అనుకున్నప్పటికీ ఆ తర్వాత ఆ స్థానంలో అనసూయను తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. తొలి ఎంట్రీతోనే ఐటం సాంగు చేయడం ఇష్టం లేక పోయనా...నాగబాబు నచ్చజెప్పడంతో ఓకే చెప్పిందట అనసూయ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X