Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యారు. సినిమా, రాజకీయ, సామజిక అంశాల గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తన అభిప్రాయాలని తెలియజేస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా నాగబాబు చేసిన చాలా వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. నాగబాబు తాజాగా తన యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ మహిళలు, హీరోయిన్ల డ్రెస్ గురించి కామెంట్ చేస్తున్నవారిపై ఘాటుగా స్పందించారు. కొన్ని రోజుల క్రితం ప్రముఖ సింగర్ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ హీరోయిన్లు ఎక్స్ ఫోజింగ్ చేసే డ్రెస్సులు వేసుకుంటేనే అవకాశాలు వస్తాయా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై నాగబాబు ఈ వీడియోలో పరోక్షంగా స్పందించినట్లు తెలుస్తోంది.
వాళ్లంతా మహానుభావులు
ఇటీవల కొందరు మహానుభావులు, గౌరవనీయులు కొందరు ఆడవాళ్ళ డ్రెస్సింగ్ గురించి మాట్లాడారు. తెలుగు సినిమాలో సంగీతంలో అత్యంత ప్రముఖుడైన ఓ మహానానుభావుడు కూడా ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి కామెంట్స్ చేశారు. వాళ్ళ పేర్లు చెప్పడం ఇష్టం లేదు. ప్రవచనాలు చెప్పే ఓ వ్యక్తి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆడవాళ్లు శరీరాన్ని ఎక్స్ ఫోజ్చేస్తూ డ్రెస్ వేసుకోకూడదు. అందువలనే అత్యాచారాలు జరుగుతున్నాయి అన్నట్లుగా వీళ్లంతా కెమెంట్ చేశారు అని నాగబాబు తెలిపారు.
మీరు ఎవరు చెప్పడానికి
ఆడవాళ్లు సాంప్రదాయ బద్దంగా డ్రెస్ వేసుకోవాలి అని అంటున్నారు. అసలు ఓ మహిళ ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో మీరు ఎవరు చెప్పడానికి అని నాగబాబు ఘాటుగా స్పందించారు. మహిళలు అలాంటి డ్రెస్ వేసుకోవడం వలనే మగవాళ్ల కోరికలు పెరుగుతున్నాయి అని అంటున్నారు. కానీ ఒళ్ళంతా కప్పకుని డ్రెస్ వేసుకున్న మహిళలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. అత్యాచారాలు చేసే వాళ్ళ బుద్ది అలాంటిది కాబట్టి ఈ ఘటనలు జరుగుతున్నాయని నాగబాబు అన్నారు.
వ్యక్తిగత హక్కు
ఒక మహిళ తనకు నచ్చిన డ్రెస్ వేసులోవచ్చు. అది వాళ్ళ వ్యక్తిగత హక్కు. హీరోయిన్లు ఎలాంటి డ్రెస్ వేసుకుంటే మీకు ఏంటి. ఓ మహిళ అందగా కనిపించాలా, అట్రాక్టివ్ గా కనిపించాలా అనేది ఆమె ఛాయిస్ అని నాగబాబు అన్నారు. ఇంతవరకు ఏ మహిళ అయినా ఓ మగాడు ఇలాంటి బట్టలే వేసుకోవాలి అని చెప్పిందా. ప్యాంట్లు మన సంప్రదాయం కాదు. అందరూ పంచెలే కట్టుకోండి అని మహిళలు ఎవరైనా చెప్పారా అంటూ నాగబాబు ప్రశ్నించారు.
డిక్టేట్ చేస్తున్నారు ఏంటి
ప్రపంచంలో ఏ మహిళా ఓ మగాడు ఇలాంటి డ్రెస్సే వేసుకోవాలని చెప్పలేదు. కానీ మీరు మాత్రం వాళ్ళని డిక్టేట్ చేసేలా మాట్లాడతారు ఏంటి. ఇకనైనా మారండి అని నాగబాబు అన్నారు. ఎన్నాళ్లు ఇలా మతం ముసుగులో బూజు పట్టిన సంప్రదాయాలు పట్టుకుని వేలాడతారు అంటూ నాగబాబు ఘాటుగా ఫైర్ అయ్యారు.
వారిపై ద్రుష్టి ఎందుకు పడుతోంది
హీరోయిన్లు ఈవెంట్స్ లో ఎక్స్ ఫోజ్ చేస్తూ డ్రెస్ వేసుకోకూడదు అని మాట్లాడుతున్నారు. అసలు మీ ద్రుష్టి వాళ్లపై ఎందుకు పడుతోంది. అమ్మాయిల క్లీవేజ్ కనిపిస్తోంది, బొడ్డు కనిపిస్తోంది, తొడలు కనిపిస్తున్నాయి అని అంటున్నారు. అసలు ఆ దృష్టితో ఎందుకు చూస్తున్నారు. అలా చూసేవాళ్ళే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు అంటూ నాగబాబు ఫైర్ అయ్యారు. ముందు మీ వక్రబుద్ధి మార్చుకోండి అని నాగబాబు సలహా ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.